Bajaj Pulsar N250 : బజాజ్ ఆటో నుంచి సరికొత్త పల్సర్ N250 బైక్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్, కొత్త ధర ఎంతో తెలుసా?

2024 పల్సర్ ఎన్250 బైక్.. ఇప్పుడు రోడ్, రెయిన్, ఆఫ్‌రోడ్ అనే 3 ఏబీఎస్ మోడ్‌లతో పాటు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌ను పొందింది. ట్రాక్షన్ కంట్రోల్‌ని 'ఆఫ్‌రోడ్' ఏబీఎస్ మోడ్‌లో స్విచ్ ఆఫ్ చేయవచ్చు.

Bajaj Pulsar N250 : బజాజ్ ఆటో నుంచి సరికొత్త పల్సర్ N250 బైక్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్, కొత్త ధర ఎంతో తెలుసా?

Bajaj launches updated Pulsar N250 at Rs 1.51 lakh

Updated On : April 11, 2024 / 6:40 PM IST

Bajaj Pulsar N250 : బజాజ్ ఆటో భారత మార్కెట్లో అప్‌డేట్ పల్సర్ ఎన్250 బైక్ లాంచ్ చేసింది. ఈ కొత్త బజాజ్ బైక్ ధర ఇప్పుడు రూ. 1.51 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. కొత్తగా అప్‌డేట్ చేసిన ఫీచర్లతో ఈ బజాజ్ పల్సర్ బైక్ ధర రూ. 829 ధర పెరిగింది. మార్పుల పరంగా పరిశీలిస్తే.. మిగతా మోడళ్లతో పోలిస్తే అతిపెద్దది. గోల్డ్ కలర్‌లో ఫినిషింగ్ కొత్త 37ఎమ్ఎమ్ అప్ సైడ్ డౌన్ ఫోర్క్ కలిగి ఉంది.

Read Also : WhatsApp New Feature : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై చాట్‌లో డాక్యుమెంట్ డౌన్‌లోడ్ చేయకుండానే చూడొచ్చు..!

2024 పల్సర్ ఎన్250 బైక్.. ఇప్పుడు రోడ్, రెయిన్, ఆఫ్‌రోడ్ అనే 3 ఏబీఎస్ మోడ్‌లతో పాటు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌ను పొందింది. ట్రాక్షన్ కంట్రోల్‌ని ‘ఆఫ్‌రోడ్’ ఏబీఎస్ మోడ్‌లో స్విచ్ ఆఫ్ చేయవచ్చు. 164 కిలోల వద్ద కొత్త పల్సర్ ఎన్250 బరువు 2 కిలోలు పెరిగింది.

మూడు కొత్త కలర్ ఆప్షన్లలో :
బజాజ్ రైడ్ కనెక్ట్ యాప్ ద్వారా బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్‌కు సపోర్టు ఇచ్చే కొత్త ఫుల్-డిజిటల్ ఎల్‌సీడీ స్క్రీన్ కూడా ఉంది. అప్‌డేట్ చేసిన పల్సర్ ఎన్250 ప్రతి చివర 10ఎమ్ఎమ్ అప్‌గ్రేడ్‌తో వైడ్ రేంజ్ టైర్లను కూడా కలిగి ఉంది. ఏబీఎస్ రైడింగ్ మోడ్‌ల మధ్య మారడానికి అనుగుణంగా స్విచ్ గేర్ కూడా ఉంది. అంతేకాకుండా, 2024 పల్సర్ ఎన్250 మూడు కొత్త కలర్ ఆప్షన్లు, అప్‌డేట్ చేసిన గ్రాఫిక్‌లను కూడా పొందింది. ఈ కొత్త కలర్ ఆప్షన్లలో గ్లోసీ రేసింగ్ రెడ్, బ్రూక్లిన్ బ్లాక్, పెరల్ మెటాలిక్ వైట్ ఉన్నాయి.

249సీసీ, సింగిల్-సిలిండర్ మోటార్ కూడా మునుపటి వెర్షన్ మాదిరిగానే ఉంది. ఇప్పటికీ 24bhp, 21.5Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ప్-అండ్-అసిస్ట్ క్లచ్‌ని కలిగి ఉంది. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ఫ్రంట్ సైడ్ 300ఎమ్ఎమ్ డిస్క్, బ్యాక్ సైడ్ 230ఎమ్ఎమ్ డిస్క్ ఆపరేట్ చేయొచ్చు. డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ ప్రామాణికమైనది. ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, యూఎస్‌బీ టైప్-ఎ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉన్నాయి. సీట్ హీట్, గ్రౌండ్ క్లియరెన్స్ వరుసగా 800ఎమ్ఎమ్, 165ఎమ్ఎమ్ వద్ద ఉన్నాయి.

Read Also : Apple Warn iPhone Users : మెర్సిన‌రీ స్పైవేర్‌ అటాక్.. భారత్ సహా 92 దేశాల్లోని ఐఫోన్ యూజర్లకు ఆపిల్ హెచ్చరిక..!