జూన్‌లో UPI పేమెంట్స్ ఆల్ టైమ్ రికార్డు.. ఎంతో తెలుసా?

నేషనల్ పేమెంట్స్ కార్ప్ ఆఫ్ ఇండియా (NPCI) గణాంకాల ప్రకారం.. జూన్‌లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) పేమెంట్స్ 1.34 బిలియన్లకు చేరుకున్నాయి. వాల్యూమ్ పరంగా లావాదేవీల విలువ దాదాపు రూ.2.62 లక్షల కోట్లు చేరుకున్నట్టు NPCI డేటా వెల్లడించింది.

లావాదేవీల సంఖ్య 999 మిలియన్ విలువతో ఏప్రిల్ నెలలో 1.51 లక్షల కోట్లు రికార్డు అయ్యాయి. మొదటి పూర్తి నెల లాక్ డౌన్ ప్రకటనతో నిత్యావసరాల తప్ప, దాదాపు అన్ని సర్వీసులు నిలిచిపోయాయి. మే నుంచి నెమ్మదిగా ఆన్‌లైన్ చెల్లింపులు వృద్ధి చెందడంతో ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతోంది.

గత మే నెలలో, UPI లావాదేవీల సంఖ్య 1.23 బిలియన్ డాలర్ల విలువతో రూ. 2.13 లక్షల కోట్లుగా రికార్డు సాధించినట్టు NPCI డేటా వెల్లడించింది. భారతదేశంలో రిటైల్ చెల్లింపులు, సెటిల్ మెంట్ వ్యవస్థలను నిర్వహించడానికి NPCI 2008లో విలీనం చేయడం జరిగింది. NPCI దేశంలో బలమైన చెల్లింపు పరిష్కార మౌలిక సదుపాయాలను సృష్టించింది.

RuPay Card, Immediate Payment Service (IMPS), UPI, భారత్ ఇంటర్ ఫేస్ ఫర్ మనీ (BHIM), BHIM ఆధార్, నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (NETC Fastag), Bharat BillPay వంటి రిటైల్ చెల్లింపు ఉత్పత్తుల ద్వారా చెల్లింపులను సులభతరం చేస్తుంది. ఆన్ లైన్ యూజర్లు, వ్యాపారులకు మరింత సురక్షితమైన, సమగ్రమైన సేవలను అందించడానికి NPCI UPI 2.0ను ప్రారంభించింది.

ట్రెండింగ్ వార్తలు