Site icon 10TV Telugu

UPI Payments : యూజర్లకు బిగ్ అలర్ట్.. UPI పేమెంట్లు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయంటే? NPCI వన్‌షాట్ ఆన్సర్..!

UPI Payments

UPI Payments

UPI Payments : యూపీఐ పేమెంట్లతో యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పేమెంట్ సమయంలో నిలిచిపోవడం డబ్బులు అకౌంటులో డెబిట్ కావడం వంటి సమస్యలు (UPI Payments) ఎక్కువగా తలెత్తాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ప్లాట్‌ఫామ్ ద్వారా ఆన్‌లైన్ పేమెంట్లు చేస్తున్నప్పుడు చాలా మంది యూజర్లు ఇలాంటి సమస్యలను రిపోర్టు చేశారు.

కొంతమంది వినియోగదారులు పేమెంట్ల తర్వాత తమ స్క్రీన్‌లు స్తంభించినట్టుగా గమనించారు. మరికొందరు పేమెంట్ స్టేటస్ సంబంధించి కన్ఫర్మేషన్ వచ్చేందుకు సాధారణం కన్నా ఎక్కువ సమయం పడుతోందని ఫిర్యాదు చేశారు. యూపీఐ పేమెంట్లలో సాంకేతిక సమస్యలపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) స్పందించింది.

దీనిపై స్పందిస్తూ, యూపీఐ ప్లాట్‌ఫామ్‌ సిస్టమ్స్ బాగానే రన్ అవుతున్నాయని కొన్ని బ్యాంకులు ఇంటర్నల్ టెక్నికల్ సమస్యలను ఎదుర్కొంటున్న కారణంగా వినియోగదారులు యూపీఐ పేమెంట్లలో తాత్కాలిక సమస్యలు తలెత్తాయని పేర్కొంది. “కొన్ని బ్యాంకులు కొన్ని ఇంటర్నల్ టెక్నికల్ సమస్యల కారణంగా UPI కనెక్టివిటీ సమస్యలు ఎదుర్కొంటున్నాయి” అని NPCI ఒక ప్రకటనలో తెలిపింది.

బ్యాంకింగ్ సిస్టమ్స్ ఇబ్బందులను ఎదుర్కొన్నాయని, దీనివల్ల వినియోగదారులు అసౌకర్యానికి గురయ్యారని త్వరిత పరిష్కారం కోసం ఈ బ్యాంకులతో కలిసి పనిచేశామని ఎన్‌పీసీఐ వెల్లడించింది.

Read Also : Vivo V50 : అమెజాన్ అద్భుతమైన ఆఫర్.. ఇలా కొన్నారంటే వివో V50 ఫోన్ అతి తక్కువ ధరకే.. ఇలాంటి డీల్ మళ్లీ రాదు..!

రికార్డు స్థాయిలో UPI పేమెంట్లు :
గత జూలైలో యూపీఐ లావాదేవీలు రికార్డు స్థాయిలో 19.47 బిలియన్లకు చేరుకున్నాయి. అంటే.. రూ.25.08 లక్షల కోట్లు. గత మేలో నమోదైన రూ.25.14 లక్షల కోట్ల తర్వాత ఇది రెండో అత్యధికం. ఇప్పటికే ఏడు దేశాలలో యూపీఐ అందుబాటులో ఉంది. భారత్‌లోనే మొత్తం డిజిటల్ లావాదేవీలలో 85 శాతం వాటాను కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 శాతం రియల్-టైమ్ డిజిటల్ పేమెంట్లు జరుగుతున్నాయి.

UPI కొత్త పరిమితులివే :
NPCI రూల్ ప్రకారం.. యూపీఐ యూజర్ ఏదైనా యాప్ ద్వారా వారి అకౌంట్ బ్యాలెన్స్‌ను రోజుకు 50 సార్లు చెక్ చేయగలరు. గతంలో, యూపీఐ యాప్ ద్వారా బ్యాలెన్స్‌ను చెక్ చేసేందుకు ఎలాంటి పరిమితి లేదు. సిస్టమ్ లోడ్‌ను తగ్గించడమే లక్ష్యంగా ఈ పరిమితిని విధించినట్లు NPCI తెలిపింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. యూపీఐ సిస్టమ్ వేగంగా ఉంటుంది. పేమెంట్ ఫెయిల్ కావడం వంటివి తగ్గుతాయి.

యూపీఐ పేమెంట్లపై RBI గవర్నర్ ఏమన్నారంటే? :
ఇటీవలే యూపీఐ పేమెంట్లపై రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రస్తావించారు. యూజర్లకు UPI ఉచితమే. కానీ, ఎవరో ఒకరు ఇప్పటికే ఆ ఖర్చును భరిస్తున్నారు. ఎవరు చెల్లిస్తారనేది ముఖ్యం. కానీ, ఎవరో ఒకరు బిల్లు చెల్లించాలి అనేది వాస్తవం. సమిష్టిగా లేదా వ్యక్తిగతంగా ఎవరైనా చెల్లించాలి” అని ఆయన ప్రస్తావించినట్టు కొన్ని మీడియా నివేదికలు పేర్కొన్నాయి.

Exit mobile version