Vivo V50 : అమెజాన్ అద్భుతమైన ఆఫర్.. ఇలా కొన్నారంటే వివో V50 ఫోన్ అతి తక్కువ ధరకే.. ఇలాంటి డీల్ మళ్లీ రాదు..!
Vivo V50 : అమెజాన్‌లో వివో V50 ధర తగ్గిందోచ్.. ఈ అద్భుతమైన డీల్ మీకోసమే.. వివో V50 బిగ్ డిస్కౌంట్ ఎలా పొందాలంటే?

Vivo V50 price drop
Vivo V50 : వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. అమెజాన్‌లో వివో ఫోన్ ధర తగ్గిందోచ్.. మీ పాత ఫోన్ పక్కన పడేసి ఈ కొత్త ఫోన్ తీసేసుకోండి. వివో V50 అద్భుతమైన (Vivo V50 Discount) డిజైన్, ఫీచర్లతో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ తక్కువ ధరకే లభిస్తోంది. అసలు ధర రూ. 34,999 ఉండగా ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ. 4,700 కన్నా భారీ తగ్గింపుతో లభ్యమవుతుంది.
ఈ వివో ఫోన్ 120 Hz డిస్‌ప్లే, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ ప్రాసెసర్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో బ్యాటరీని కలిగి ఉంది. ఈ అద్భుతమైన డీల్ అసలు వదులుకోవద్దు. వివో V50 బిగ్ డిస్కౌంట్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
అమెజాన్‌లో వివో V50 డీల్ :
భారత మార్కెట్లో వివో V50 ప్రారంభ ధర రూ.34,999కి లాంచ్ అయింది. ప్రస్తుతం రూ.31,256 ధరకు అందుబాటులో ఉంది. అమెజాన్‌లో రూ.3,743 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చ. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.1,000 డిస్కౌంట్ కూడా అందిస్తోంది. ధర రూ.30,256కి తగ్గింది.
మీ పాత ఫోన్ రూ. 29,550 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూ ట్రేడ్ చేయవచ్చు. కచ్చితమైన ట్రేడ్-ఇన్ వాల్యూ మోడల్, ఫోన్ వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా, ఈ డీల్ రోజ్ రెడ్ కలర్ ఆప్షన్‌లో 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌తో వివో V50 ఫోన్‌పై మాత్రమే అందుబాటులో ఉంది.
వివో V50 స్పెసిఫికేషన్లు :
వివో V50 ఫోన్ 6.77-అంగుళాల అమోల్డ్ ప్యానెల్‌ను 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది. ఈ వివో ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3తో పాటు 12GB వరకు LPDDR4X ర్యామ్, 512GB వరకు UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుంది. ఈ వివో ఫోన్ 6,000mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది.
హుడ్ కింద 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఆండ్రాయిడ్ 15-ఆధారిత ఫన్‌టచ్ OS 15 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతుంది. ఆప్టిక్స్ పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ OISతో కూడిన 50MP ప్రైమరీ షూటర్, 50MP వైడ్-యాంగిల్ లెన్స్‌తో వస్తుంది. సెల్ఫీల కోసం ఈ వివో ఫోన్ 50MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది.