Samsung Galaxy S25 FE : ట్రిపుల్ కెమెరాలతో కొత్త శాంసంగ్ గెలాక్సీ S25 FE వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర, కీలక ఫీచర్లు లీక్..!
Samsung Galaxy S25 FE : శాంసంగ్ గెలాక్సీ S25 FE 50MP + 12MP + 8MP ట్రిపుల్ కెమెరా, 25W ఫాస్ట్ ఛార్జింగ్, 4,900mAh బ్యాటరీతో రానుంది.

Samsung Galaxy S25 FE
Samsung Galaxy S25 FE : శాంసంగ్ అభిమానులకు గుడ్ న్యూస్.. అతి త్వరలో శాంసంగ్ నుంచి సరికొత్త గెలాక్సీ S25 FE ఫోన్ రాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా శాంసంగ్ గెలాక్సీ S25 (Samsung Galaxy S25 FE) సిరీస్‌ను లాంచ్ చేసిన తర్వాత శాంసంగ్ త్వరలో నెక్స్ట్ జనరేషన్ ఫ్యాన్ ఎడిషన్, గెలాక్సీ S25 FE మోడల్ లాంచ్ చేయనుంది.
నివేదికలను పరిశీలిస్తే.. ఈ శాంసంగ్ ఫోన్ S24FE కన్నా మరిన్ని అప్‌గ్రేడ్ ఫీచర్లతో వస్తుంది. అమోల్డ్ ప్యానెల్‌ను కలిగి ఉండవచ్చు. సన్నగా, తేలికగా ఉంటుందని అంచనా. శాంసంగ్ గెలాక్సీ S25FE అధికారిక వివరాలు ఇంకా రివీల్ కాలేదు. లీకుల ప్రకారం.. లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్లు, ధర ఎంత అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
శాంసంగ్ గెలాక్సీ S25 FE లాంచ్ తేదీ (లీక్) :
నివేదిక ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ S25 FE ఫోన్ సెప్టెంబర్ 19న లాంచ్ అవుతుందని చెబుతున్నారు. ఈ లాంచ్ దక్షిణ కొరియాకే పరిమితం కావచ్చు. భారత్, ఇతర దేశాలలో ఈ శాంసంగ్ ఫోన్ లాంచ్ అయ్యేందుకు మరికొన్ని వారాలు పట్టవచ్చని లీక్‌లు సూచిస్తున్నాయి. కచ్చితమైన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.
శాంసంగ్ గెలాక్సీ S25 FE స్పెసిఫికేషన్లు (అంచనా) :
శాంసంగ్ గెలాక్సీ S25 FE ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ (Samsung Galaxy S25 FE) విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్‌తో 6.7-అంగుళాల ఫుల్ HD+ అమోల్డ్ ప్యానెల్‌తో వస్తుందని భావిస్తున్నారు. ఎక్సినోస్ 2400 చిప్‌సెట్ కలిగి ఉండవచ్చు. 8GB వరకు ర్యామ్, 256GB వరకు స్టోరేజ్‌తో వస్తుంది.
వన్ యూఐ 8 ఆధారిత ఆండ్రాయిడ్ 16పై రన్ అవుతుంది. 25W ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,900mAh బ్యాటరీతో వస్తుంది. ఫొటోల విషయానికి వస్తే ఈ శాంసంగ్ ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 8MP టెలిఫోటో సెన్సార్ కలిగి ఉండవచ్చు. ఫ్రంట్ సైడ్ ఈ శాంసంగ్ ఫోన్ 12MP సెల్ఫీ కెమెరాతో రావచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S25 FE ధర (అంచనా) :
నివేదిక ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ S25 FE ఫోన్ (Samsung Galaxy S25 FE) ధర దాదాపు KRW 1 మిలియన్ (సుమారు రూ. 63,200) ఉండవచ్చు. భారత మార్కెట్లో ఈ శాంసంగ్ ఫోన్ ధర దాదాపు రూ. 60వేలు ఉండవచ్చు. లైట్ బ్లూ, డార్క్ బ్లూ, బ్లాక్, వైట్ నాలుగు వేర్వేరు కలర్ ఆప్షన్లలో లాంచ్ కావచ్చని నివేదిక పేర్కొంది.