వడ్డీ రేట్లు తగ్గించిన యూఎస్ ఫెడరల్.. భార‌త్‌లో బంగారం ధరలు భారీగా పెరగనున్నాయా?

రెండు నెలల్లో అమెరికా ఎన్నికలు ఉండడంతో వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయం కీలకంగా మారనుంది. బ్యాంకుల నుంచి లోన్ తీసుకునే వినియోగదారుల నుంచి మొదలు వ్యాపారస్తుల వరకు ప్రతి రంగానిపై ..

Gold

US Fed : యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయం తీసుకుంది. 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ ప్రకటించింది. గత కొంతకాలంగా వడ్డీరేట్లను తగ్గిస్తామని యూఎస్ ఫెడ్ చెబుతూ వస్తోంది. సుదీర్ఘ కాలం తరువాత.. అంటే.. 2020 తరువాత తొలిసారిగా వడ్డీ రేట్లను తగ్గించింది. ఈ ఏడాది చివర్లో మరో అరశాతం వడ్డీరేట్లు తగ్గాస్తామని యూఎస్ ఫెడ్ సంకేతాలు ఇచ్చింది. 2025లో ఒక శాతం, 2026లో చివరిగా మరో అరశాతం తగ్గించాలని భావిస్తున్నట్లుగా తెలిపింది. యూఎస్ ఫెడ్ నిర్ణయంతో అంతకుముందు 5.25 – 5.50శాతంతో 22ఏళ్ల గరిష్ట స్థాయిలోఉన్న వడ్డీ రేట్లు.. తాజాగా 4.75 – 5.0 శాతానికి చేరుకున్నాయి.

Also Read : Gold Price Today : తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్, విజయవాడలో ఇవాళ బంగారం, వెండి ధరలు ఇలా..

రెండు నెలల్లో అమెరికా ఎన్నికలు ఉండడంతో వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయం కీలకంగా మారనుంది. బ్యాంకుల నుంచి లోన్ తీసుకునే వినియోగదారుల నుంచి మొదలు వ్యాపారస్తుల వరకు ప్రతి రంగానిపై ఈ ప్రభావం ఉండనుంది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయంతో భారత్ లో బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే చుక్కలను తాకుతున్న బంగారం ధరలు మరింత పైపైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం గోల్డ్ రేటు అంతర్జాతీయ మార్కెట్లో తగ్గినప్పటికీ.. సమీప భవిష్యత్ లో ధర పెరిగే చాన్స్ ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో 21 డాలర్లు తగ్గి 2,575 డాలర్ల వద్ద ఔన్స్ గోల్డ్ కదలాడుతుంది.

 

భారత్ లో గరువారం ఉదయం నమోదైన బంగారం ధరలను ఓ పరిశీలిస్తే.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 250 తగ్గింది. దీంతో 10గ్రాముల 22 క్యారట్ల గోల్డ్ రేటు 68,250 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారట్ల గోల్డ్ రేటు 74,450 వద్ద కొనసాగుతుంది. మరోవైపు వెండి ధరలో ఇవాళ ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. దీంతో కిలో వెండి రేటు రూ. 96వేల వద్ద కొనసాగుతుంది. పలు రాష్ట్రాల్లో రూ. 85వేల నుంచి రూ. 95వేల మధ్యలో వెండి ధరలు ఉన్నాయి. ప్రస్తుతం యూఎస్ ఫెడ్ నిర్ణయంతో రాబోయే కాలంలో బంగారం, వెండి రేట్లు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.