US Recession starting soon : అమెరికాలో త్వరలో ఆర్థిక మాంద్యం.. బలహీనపడుతున్న వ్యాపార సంస్థల సూచీలు

యునైటెడ్ స్టేట్స్‌లో ఆర్థికమాంద్యం త్వరలో ప్రారంభమవుతోందా ? అంటే అవునంటున్నాయి యూఎస్ వ్యాపార సంస్థల సూచికలు...యూఎస్ వ్యాపార సూచికలు జూన్ నెలలో బలహీన పడ్డాయి....

US Recession starting soon

US Recession starting soon : అగ్రరాజ్యం అమెరికాలో త్వరలో ఆర్థికమాంద్యం రానుందా ? అంటే అవునంటున్నాయి యూఎస్ వ్యాపార సంస్థల సూచికలు. యూఎస్ వ్యాపార సూచికలు జూన్ నెలలో బలహీన పడ్డాయి. కాన్ఫరెన్స్ బోర్డు గురువారం జరిగిన సమావేశంలో తన లీడింగ్ ఎకనామిక్ ఇండెక్స్, భవిష్యత్ ఆర్థిక కార్యకలాపాలను అంచనా వేసింది. (indicators point to Recession starting soon) జూన్ నెలలో ఎకనామిక్స్ ఇండెక్స్ 0.7 శాతం క్షీణించి 106.1కి పడిపోయింది.

Heavy Rains : పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు.. ఐఎండీ హెచ్చరికల జారీ, 16మంది మృతి

జూన్ వ్యాపార సూచికలను పరిశీలిస్తే రాబోయే నెలల్లో ఆర్థిక కార్యకలాపాలు మందగిస్తాయని కాన్ఫరెన్స్ బోర్డ్‌లోని వ్యాపార చక్ర సూచికల సీనియర్ మేనేజర్ జస్టినా జబిన్స్కాలా మోనికా ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత మూడవ త్రైమాసికం నుంచి 2024 మొదటి త్రైమాసికం వరకు యూఎస్ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో ఉండవచ్చని కాన్ఫరెన్స్ బోర్డు తన సూచనను పునరుద్ఘాటించింది.

Earthquake : మణిపూర్, జైపూర్‌లో భూకంపం.. భయాందోళనల్లో జనం

ఎలివేటెడ్ ధరలు, కఠినమైన ద్రవ్య విధానం, కష్టతరమైన క్రెడిట్, ప్రభుత్వ వ్యయం తగ్గించడం వంటివి ఆర్థిక వృద్ధిని మరింత తగ్గించాయని జబిన్స్కాలా మోనికా చెప్పారు. 2022 వ సంవత్సరం జూన్, డిసెంబర్ మధ్య 3.8 శాతంతో పోలిస్తే గత ఆరు నెలల్లో 4.2 శాతం ఆర్థిక వృద్ధి పడిపోయింది.

Manipur Women Viral Video : నాటి షాకింగ్ ఘటన గురించి బాధిత మణిపూర్ మహిళ ఏం చెప్పారంటే…

దీంతో ఇటీవల పలు కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకునేందుకు లే ఆఫ్ లు ప్రకటించాయి. పలు కార్పొరేట్ కంపెనీలు వేలాదిమంది ఉద్యోగులను ఇంటికి పంపించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలితే భారత్‌తో సహా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం ఉంటుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు