Heavy Rains : పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు.. ఐఎండీ హెచ్చరికల జారీ,16మంది మృతి

దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, హిమాచల్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశాతో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది....

Heavy Rains : పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు.. ఐఎండీ హెచ్చరికల జారీ,16మంది మృతి

Heavy Rains

Heavy Rains : దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, హిమాచల్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశాతో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. (Heavy Rains) భారీవర్షాల నేపథ్యంలో శుక్రవారం ఉత్తరాఖండ్‌లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. (alerts issued in Uttarakhand, Himachal, Gujarat) ఉత్తరాఖండ్‌లో శనివారం ఎల్లో అలర్ట్‌ను ఐఎండీ జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్‌లో జులై 22 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసినందున కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.

మధ్య భారతంలో భారీ వర్ష హెచ్చరికలు

ఐఎండీ మధ్య భారతదేశం, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో జులై 22వతేదీ వరకు భారీ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 22 వతేదీ వరకు మధ్యప్రదేశ్‌, విదర్భ, చత్తీస్‌గఢ్‌లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది. వచ్చే ఐదు రోజుల్లో మహారాష్ట్రలో, మరో మూడు రోజుల్లో గుజరాత్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మహారాష్ట్రలో రెడ్ అలర్ట్ 

పూణే, రాయ్‌గఢ్, పాల్ఘర్ మరియు థానే జిల్లాలతో సహా మహారాష్ట్రలోని నాలుగు జిల్లాలకు IMD శుక్రవారం రెడ్ అలర్ట్ ప్రకటించింది. నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముంబైకి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.  రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో జులై 26వతేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముంబయిలో శనివారం వరకు వివిధ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి.

ముంబయిలోనూ వరదలు…

ముంబయితో సహా మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించి సాధారణ జనజీవనం అతలాకుతలమైంది. రెడ్ అలర్ట్ హెచ్చరికల దృష్ట్యా వచ్చే రెండు రోజుల పాటు థానే, పాల్ఘర్‌లలో అన్ని పాఠశాలలు, కళాశాలలు మూసివేయాలని ఆదేశించారు. (Heavy rain batters Mumbai) అంబేగావ్, ఖేడ్, జున్నార్, భోర్, పురందర్, ముల్షి, మావల్ తాలూకాలలోని మొత్తం 355 పాఠశాలలు గురువారం తెరవలేదు, పాఠశాలలు శుక్రవారం కూడా మూసివేశారు.

రాయగడ కొండచరియలు విరిగిపడ్డాయి…16 మంది మృతి

మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడటంతో 16 మంది మరణించారు. ఈ కొండచరియల కింద శిథిలాల్లో 100 మందికి పైగా చిక్కుకుపోయారని భయపడ్డారు. రాయ్‌ఘడ్‌లోని ఖలాపూర్ తహసీల్‌లోని ఇర్షాల్‌వాడి గ్రామంలో కొండచరియలు విరిగిపడి 48 కుటుంబాలు అతలాకుతలమయ్యాయి. ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

తెలంగాణలో ఎడతెరిపి లేని వర్షాలు

తెలంగాణలో భారీవర్షాలు కురుస్తున్నందున గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం (జులై 21), శనివారం (జులై 22) రెండు రోజుల సెలవు ప్రకటించింది. గురువారం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్‌లు, రాష్ట్రంలోని కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసిందని, భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దు…

ఒడిశా రాష్ట్రంలోని మల్కన్‌గిరి జిల్లాతో పాటు పలు ప్రాంతాలు భారీవర్షాలతో ఆకస్మిక వరదలు వెల్లువెత్తాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన తరువాత ఒడిశాలోని పలు ప్రాంతాల్లో గురువారం విస్తారంగా వర్షాలు కురిశాయని వాతావరణ నిపుణులు తెలిపారు. బంగాళాఖాతంలో తుపాను ప్రభావం ఏర్పడింది. దీని ప్రభావంతో జులై 20 నుంచి 22 వరకు ఒడిశా తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. ఈ సమయంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ కేంద్రం సూచించింది. ఒడిశా రాష్ట్రంలో జులై 24 వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.