Vi Business IoT Smart Central : అత్యంత అధునాతనమైన ఐఓటీ స్మార్ట్ సెంట్రల్ ప్రారంభించిన విఐ బిజినెస్

Vi Business IoT Smart Central : ప్రముఖ టెలికాం ప్లేయర్ భారత మార్కెట్లోనే అతిపెద్ద ఐఓటి ప్లేయర్‌లలో ఒకటైన విఐ ఎంటర్‌ప్రైజ్ విభాగం, విఐ (వోడాఫోన్ ఐడియా) బిజినెస్ ఐఓటి స్మార్ట్ సెంట్రల్‌ను ప్రారంభించింది.

Vi Business Launches IoT Smart Central, the Most Advanced

Vi Business IoT Smart Central : ప్రముఖ టెలికాం ప్లేయర్ భారత మార్కెట్లోనే అతిపెద్ద ఐఓటి ప్లేయర్‌లలో ఒకటైన విఐ ఎంటర్‌ప్రైజ్ విభాగం, విఐ (వోడాఫోన్ ఐడియా) బిజినెస్ ఐఓటి స్మార్ట్ సెంట్రల్‌ను ప్రారంభించింది. ఈ ఐఓటీ స్మార్ట్ సెంట్రల్ అత్యంత అధునాతనమైనది మాత్రమే కాదు.. ఐఓటీ ఆస్తుల నిర్వాహణ కోసం సెల్ఫ్ కేర్ ప్లాట్‌ఫారం కూడా కలిగి ఉంది.

Read Also : Vodafone Idea 5G Services : భారత్‌కు రానున్న వోడాఫోన్ ఐడియా 5G సర్వీసులు.. ఎయిర్‌టెల్, జియో 5జీ ప్లాన్ ధరలు ప్రకటించే ఛాన్స్!

భవిష్యత్ ప్రణాళికలతో ఫుల్ ఇంటిగ్రేటెడ్, సెల్ఫ్-ప్రొటెక్షన్ ఐఓటి కనెక్టివిటీ, డివైజ్ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫారం. కొత్తగా ఆవిష్కరించిన విఐ బిజినెస్ ఐఓటి స్మార్ట్ సెంట్రల్ ప్లాట్‌ఫారమ్ రియల్ టైమ్ ప్రాతిపదికన రిమోట్‌గా ఐఓటి ఆస్తులను నియంత్రించడానికి, పర్యవేక్షించడానికి, నిర్వహించడానికి సంస్థలకు అధికారాన్ని ఇస్తుంది.

సింగిల్ డాష్‌బోర్డ్ ద్వారా రిమోట్‌గా వినియోగదారుల ఐఓటి అసెట్స్ కనెక్ట్ చేయడం, నియంత్రించడంతోపాటు నిర్వహించడం ద్వారా వ్యాపార సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ఐఓటి అసెట్స్ జీవితంలోని కార్యకలాపాలను సజావుగా నిర్వహించడానికి ఏపీఐ థర్డ్-పార్టీ అప్లికేషన్‌లతో అనుసంధానించడానికి అనువైనదిగా చెప్పవచ్చు. ఈ కార్యక్రమం వొడాఫోన్ ఐడియా ఈవీపీ హెడ్ ఐఓటి బిజినెస్ అమిత్ సత్పతి మాట్లాడుతూ.. ఐఓటి పెరుగుతున్న స్వీకరణతో రాబోయే దశాబ్దంలో భారీ ఐఓటీ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి చెందుతుందన్నారు.

Vi Business IoT Smart Central

ఐఓటి వృద్ధికి ప్రభుత్వం ప్రయత్నాలు అభినందనీయం :
బిలియన్ల కొద్దీ కనెక్ట్ చేసిన డివైజ్‌లను ఎనేబుల్ చేస్తుందని చెప్పారు. విఐ బిజినెస్ ఐఓటి స్మార్ట్ సెంట్రల్ ప్రారంభించడం అనేది భారత ఐఓటి విభాగంలో బలమైన సామర్థ్యం, నాయకత్వానికి పురోగతిగా పేర్కొన్నారు. భారత మార్కెట్లో ఐఓటి వృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి ప్రభుత్వం తీసుకున్న ప్రయత్నాలను అభినందిస్తున్నామని అన్నారు.

విఐ బిజినెస్ ఐఓటి స్మార్ట్ సెంట్రల్ కస్టమర్‌లకు అందించిన వ్యాపార ప్రయోజనాల గురించి రివోల్ట్ మోటర్స్ డైరెక్టర్ సందీప్ కుమార్ మాట్లాడుతూ.. ‘భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ మోటర్‌సైకిల్ లీడర్‌గా, ఐఓటి టెక్నాలజీని, డెలివరీని అత్యుత్తమంగా అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

మార్కెట్లో మరింత పోటీని కొనసాగించడానికి ఐఓటి సొల్యూషన్ పార్టనర్ విఐ బిజినెస్ కీలక పాత్ర పోషిస్తుంది. విఐ బిజినెస్ ఐఓటి స్మార్ట్ సెంట్రల్ ప్లాట్‌ఫారమ్ కార్యాచరణ వ్యయాన్ని తగ్గించడానికి రియల్ టైమ్ విజిబిలిటీని మెరుగుపరచడానికి మల్టీ యాక్టివిటీ వర్క్ స్ట్రీమ్‌లను ఆటోమేట్ చేయడానికి వీలు కల్పించింది’ అని అన్నారు.

Read Also : Vivo V30 Launch : 50ఎంపీ సెల్ఫీ కెమెరాతో వివో V30 ఫోన్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే..!

ట్రెండింగ్ వార్తలు