Vodafone Idea 5G Services : భారత్‌కు రానున్న వోడాఫోన్ ఐడియా 5G సర్వీసులు.. ఎయిర్‌టెల్, జియో 5జీ ప్లాన్ ధరలు ప్రకటించే ఛాన్స్!

Vodafone Idea 5G : వోడాఫోన్ ఐడియా వచ్చే 6-7 నెలల్లో భారత టెలికం మార్కెట్లో 5జీ సర్వీసులను ప్రవేశపెట్టనుంది. పోటీదారులు ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో నుంచి 5జీ ప్లాన్‌ల ధరలకు సంబంధించి వివరాలను కంపెనీ ఎగ్జిక్యూటివ్ వెల్లడించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Vodafone Idea 5G Services : భారత్‌కు రానున్న వోడాఫోన్ ఐడియా 5G సర్వీసులు.. ఎయిర్‌టెల్, జియో 5జీ ప్లాన్ ధరలు ప్రకటించే ఛాన్స్!

Vodafone Idea to launch 5G in India, Airtel and Jio 5G plan prices

Vodafone Idea 5G Services : ప్రముఖ దేశీయ అతిపెద్ద టెలికం కంపెనీ వోడాఫోన్ ఐడియా (Vi) 5జీ సర్వీసులను రాబోయే 6 నుంచి 7 నెలల్లో భారత మార్కెట్లో ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. టెలికాం ల్యాండ్‌స్కేప్‌లో ఇతర కంపెనీ దిగ్గజాలకు పోటీగా తీసుకొస్తోంది. అయినప్పటికీ, టెలికం పోటీదారులైన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ ఇప్పటికే దేశవ్యాప్తంగా తమ 5జీ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చాయి.

ఎకనామిక్ టైమ్స్ ప్రకారం.. పోటీదారులు ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో నుంచి 5జీ ప్లాన్‌ల ధరలకు సంబంధించి వివరాలు వెల్లడయ్యాయి. కంపెనీ మూడో త్రైమాసిక ఆదాయాల ప్రకటన సందర్భంగా కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్, అక్షయ మూండ్రా 5జీ సర్వీసులకు సంబంధించి మరిన్ని వివరాలను రివీల్ చేశారు.

6 నుంచి 7 నెలల్లో 5జీ సర్వీసులు :
వోడాఫోన్ ఐడియా ఎట్టకేలకు భారత్‌లో 5జీ సర్వీసులను లాంచ్ చేయనున్నట్టు ధృవీకరించింది. 5జీ సర్వీసులను ప్రారంభించే దిశగా వోడాఫోన్ ఐడియా అడుగులు వేస్తోందని మూండ్రా పేర్కొన్నారు. సుమారు 6 నుంచి 7 నెలల్లో 5జీ సేవలను ప్రారంభించే అవకాశం ఉంది.

Read Also : Ola Electric Sales January : జనవరిలో దుమ్మురేపిన ఓలా ఎలక్ట్రిక్.. అత్యధిక నెలవారీ రిజిస్ట్రేషన్లతో రికార్డు.. 40శాతం వాటాతో ఆధిపత్యం..!

అయినప్పటికీ, వోడాఫోన్ ఐడియా 5జీ ప్లాన్‌ల గురించి నిర్దిష్ట వివరాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఎందుకంటే.. కొనసాగుతున్న నిధుల సేకరణ కార్యక్రమాలను పూర్తి చేయడంపై ఆధారపడి ఉంటుంది. దేశంలో 5జీ ప్రారంభించేందుకు తన వ్యూహాన్ని ఖరారు చేయడానికి కంపెనీ టెక్నాలజీ భాగస్వాములతో చర్చలు జరుపుతోందని ఆయన వెల్లడించారు.

3జీ సర్వీసుల నిలిపివేతపై చర్యలు :
కానీ, ఇతర పోటీదారుల్లో జియో, ఎయిర్‌టెల్ 5జీ రేసులో చాలా ముందున్నాయని చెప్పాలి. జియో ఇప్పటికే దేశవ్యాప్తంగా 5జీ సర్వీసులను విస్తరించింది. అయితే, మార్చి 2024 నాటికి ఎయిర్‌టెల్ అదే స్థాయిలో సర్వీసులను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Vodafone Idea to launch 5G in India, Airtel and Jio 5G plan prices

Vodafone Idea to launch 5G in India

అంతేకాకుండా, క్యూ3 2023లో మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ముంబై, కోల్‌కతా వంటి కీలక ప్రాంతాలలో 3జీ సర్వీసులను నిలిపివేయడంతో పాటు వోడాఫోన్ ఐడియా సర్వీసులను క్రమబద్ధీకరించడానికి వ్యూహాత్మక చర్యలను చేపట్టింది. అలాగే, 2025 ఆర్థిక సంవత్సరం నాటికి 3జీ నెట్‌వర్క్‌ను పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసే ప్రణాళికలను రచిస్తోంది.

ఎయిర్‌టెల్ జియో 5G ప్లాన్ ధరలపై త్వరలో ప్రకటన :
5జీ మానిటైజేషన్ అంశంపై (Moondra) రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ 5జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో చేసిన ముఖ్యమైన పెట్టుబడులను వెల్లడించింది. 5జీలో ఇప్పటికే గణనీయమైన పెట్టుబడులు (రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ ద్వారా) ఉన్నప్పటికీ ఇంకా డబ్బు ఆర్జన జరగడం లేదని నివేదిక తెలిపింది. ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో రెండూ 5జీ ప్లాన్ ధరలను ప్రకటించే అవకాశం ఉంది.

రాబోయే రోజుల్లో 5జీ సేవలను ఉచితంగా అందించవచ్చు. ఈ పరిణామాలను ఏ కంపెనీ అధికారికంగా ధృవీకరించలేదు. వోడాఫోన్ ఐడియా ఎగ్జిక్యూటివ్ అలాంటి ప్రకటనలు ఉండొచ్చునని సూచించారు. అధికారిక లాంచ్ సమయంలో Vi 5జీ ప్లాన్ ధరలను కూడా వెల్లడిస్తుందని మూండ్రా వెల్లడించారు. మిగిలిన వివరాలు ప్రస్తుతం తెలియరాలేదు.

Read Also : Paytm Payments Bank : పేటీఎంకు భారీ షాకిచ్చిన ఆర్బీఐ.. పేమెంట్స్ బ్యాంకు సర్వీసులపై నిషేధం.. ఎప్పటినుంచంటే?