Vivo V40e Discount
Vivo V40e Price Cut : కొత్త వివో స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం. మీ బడ్జెట్‌లో Vivo V40e అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. మీరు ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా సరసమైన ధరకు కొనుగోలు చేయొచ్చు.
అంతేకాదు.. ఈ వివో కొనుగోలుపై చాలా ఆఫర్లు, డిస్కౌంట్లు ఉన్నాయి. తద్వారా వివో V40e ఇంకా తక్కువ ధరలో వస్తుంది. అద్భుతమైన ఫీచర్లు కలిగిన వివో ఫోన్ ధర, ఫీచర్లు, ఆఫర్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
వివో V40e ఫోన్ ధరపై డిస్కౌంట్ :
ఈ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్, 128జీబీ ROM ఆప్షన్ ధర రూ. 33999గా ఉంది. మీరు విజయ్ సేల్స్ ద్వారా ఈ వివో ఫోన్ 37శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. తద్వారా వివో V40e ఫోన్ ధర రూ. 21499కు తగ్గుతుంది. అయితే, ఈ వివో ఫోన్ ధరను ఇంకా తగ్గించుకోవచ్చు.
హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్ కార్డులపై రూ. 2500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. RBL బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై 7.5శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. మీకు ఎలాంటి ఎక్స్ఛేంజ్ ఆఫర్ లభించదు. మీకు కావాలంటే.. రూ. 1024 ఈఎంఐ ఆప్షన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు.
వివో V40 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
డిస్‌ప్లే : 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 6.7-అంగుళాల భారీ FHD+ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. HDR10+ సపోర్ట్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది.
చిప్‌సెట్ : స్పీడ్, మల్టీ టాస్కింగ్ కోసం ఈ లేటెస్ట్ వివో ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ఉంది.
కెమెరా సెటప్ : ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. 50MP సోనీ IMX882 సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 50MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇందులో ఏఐ కెమెరా కూడా ఉంది.
బ్యాటరీ, కనెక్టివిటీ : ఈ వివో ఫోన్ 5500 mAh బ్యాటరీని కలిగి ఉంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 4G LTE, Wi-Fi, బ్లూటూత్, GPS/A-GPS, USB టైప్-C పోర్ట్, 5G ఫీచర్లు ఉన్నాయి.