iPhone 17 Ultra : ఆపిల్ లవర్స్ ఇది చదివారా? వచ్చేది ‘ప్రో మాక్స్’ కాదు.. ఐఫోన్ 17 అల్ట్రా అంట.. లాంచ్ ఎప్పుడో తెలిసిందోచ్!

iPhone 17 Ultra : ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? కొత్త ఐఫోన్ 17 సిరీస్ వచ్చేస్తోంది. ప్రో మ్యాక్స్ వేరియంట్ స్థానంలో ఐఫోన్ 17 అల్ట్రా మోడల్ లాంచ్ కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

iPhone 17 Ultra : ఆపిల్ లవర్స్ ఇది చదివారా? వచ్చేది ‘ప్రో మాక్స్’ కాదు.. ఐఫోన్ 17 అల్ట్రా అంట.. లాంచ్ ఎప్పుడో తెలిసిందోచ్!

iPhone 17 Ultra Tipped to Launch

Updated On : March 17, 2025 / 5:19 PM IST

iPhone 17 Ultra Launch : ఆపిల్ అభిమానులకు అదిరే న్యూస్.. కొత్త ఐఫోన్ 17 సిరీస్ రాబోతుంది. ఈ ఏడాది చివరిలో ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ అధికారికంగా లాంచ్ కానుందని భావిస్తున్నారు. రాబోయే మోడళ్ల డిజైన్, స్పెసిఫికేషన్లకు సంబంధించి కొన్ని లీక్‌లు బయటకు వచ్చాయి.

Read Also : Jio Free AirFiber : జియో యూజర్లకు పండుగే.. ఈ రీఛార్జ్ ప్లాన్లపై ఫ్రీగా ఎయిర్‌ఫైబర్, జియోహాట్‌స్టార్ సబ్‌స్ర్కిప్షన్.. ఆఫర్ ఎలా పొందాలంటే?

కొరియా కొత్త నివేదికలో కొత్త ఐఫోన్ మోడల్ సంబంధించి అనేక ఫీచర్లు రివీల్ అయ్యాయి. ఆపిల్ 2025 లైనప్‌లో భాగంగా కొత్త ఐఫోన్ 17 అల్ట్రాను ప్రవేశపెట్టనుందని చెబుతున్నారు. అల్ట్రా వేరియంట్ ప్రస్తుత ఐఫోన్ 16 ప్రో మాక్స్‌ను రిప్లేస్ చేయనుందని సమాచారం. నివేదిక నిజమైతే.. ఆపిల్ మొదటి అల్ట్రా ఫోన్‌గా ఎంట్రీ ఇవ్వనుంది.

ఈ ఏడాదిలోనే ఐఫోన్ 17 అల్ట్రా లాంచ్ :
నివేదికల ప్రకారం.. కొత్త ఐఫోన్ 17 అల్ట్రా మోడల్ వివరాలు రివీల్ అయ్యాయి. కొత్త మోడల్ ఐఫోన్ లైనప్‌లో ‘ప్రో మాక్స్’ ఫోన్ రిప్లేస్ చేయనుందని చెబుతున్నారు. ఆపిల్ ఇప్పటివరకు స్మార్ట్‌ఫోన్‌లకు అల్ట్రా లేబుల్‌ను ఉపయోగించలేదు. ఐఫోన్ 17 ప్రో మాక్స్ స్థానంలో ఐఫోన్ 17 అల్ట్రా వస్తే.. ఆపిల్ మొట్టమొదటి అల్ట్రా ఫోన్ అవుతుంది.

కుపెర్టినో ఆధారిత కంపెనీ స్మార్ట్‌వాచ్‌లు, చిప్‌సెట్ కోసం అల్ట్రా మోనికర్‌ను అందిస్తోంది. ఐఫోన్ 17 అల్ట్రా స్మాల్ డైనమిక్ ఐలాండ్‌తో వస్తుందని భావిస్తున్నారు. ఆకర్షణీయమైన థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం ఆపిల్ అల్ట్రా మోడల్‌లో స్టీమ్ చాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను అందిస్తుందని భావిస్తున్నారు.

ఈ ఐఫోన్ భారీ బ్యాటరీని కలిగి ఉంటుందని, హ్యాండ్‌సెట్ మందమైన బిల్డ్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుత ఐఫోన్ 16 ప్రో మాక్స్ 4,685mAh బ్యాటరీని కలిగి ఉందని చెబుతున్నారు. అంతేకాదు.. సింగిల్ ఛార్జ్‌పై 33 గంటల వీడియో ప్లేబ్యాక్ టైమ్ కూడా అందిస్తుందని చెబుతున్నారు.

Read Also : iPhone 16 Pro Discount : కొత్త ఐఫోన్ కొంటున్నారా? ఐఫోన్ 16ప్రోపై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ఈ అద్భుతమైన డీల్.. అసలు మిస్ చేసుకోవద్దు!

గత 2 నెలలుగా ఐఫోన్ 17 సిరీస్ గురించి అనేక పుకార్లు వస్తున్నాయి. రాబోయే హై-ఎండ్ ఐఫోన్ మోడల్స్ అల్యూమినియం ఫ్రేమ్ కలిగి ఉండొచ్చు. ఆపిల్ A19 ప్రో చిప్‌పై రన్ అవుతాయి. 12GB ర్యామ్‌తో వస్తుందని చెబుతున్నారు. స్టాండర్డ్ ఐఫోన్ 17, ఐఫోన్ 17 స్లిమ్ లేదా ఎయిర్ మోడల్ 8జీబీ ర్యామ్ సపోర్టుతో A18 లేదా A19 చిప్‌తో వచ్చే అవకాశం ఉంది.