Vivo T4 5G Today First Sale
Vivo T4 5G Sale : మీరు స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? మీకోసం లేటెస్ట్ వివో మోడల్ సేల్ మొదలైంది. వివో T4 5G ఫస్ట్ సేల్ భారత మార్కెట్లో ఈరోజు నుంచే ప్రారంభం కానుంది. మీరు కూడా ఇలాంటి బడ్జెట్ ఫోన్ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ మోడల్. ఫ్లిప్‌కార్ట్ షాపింగ్ సైట్ నుంచి అనేక ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్‌లతో కొనుగోలు చేయవచ్చు.
వివో T4 5G సేల్ ఆఫర్ :
వివో T4 5G ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 25999కు అందిస్తోంది. మీరు ఫ్లిప్‌కార్ట్ నుంచి ఈరోజు (ఏప్రిల్ 29) నుంచి మధ్యాహ్నం 12 గంటలకు 15శాతం తగ్గింపుతో కొనుగోలు చేయొచ్చు. ఈ తగ్గింపు తర్వాత కస్టమర్లకు రూ. 21,999 ధరను పొందవచ్చు.
బ్యాంక్ ఆఫర్ కింద మీకు SBI, Axis బ్యాంక్ కార్డులపై రూ. 2వేలు తగ్గింపు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుపై 5శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. మీరు ఈ ఫోన్‌ను రూ. 20, 500 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో కొనుగోలు చేయవచ్చు. నిబంధనలు, షరతుల ప్రకారం.. రూ. 3667 నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు.
వివో T4 5G స్పెసిఫికేషన్లు :
ఈ వివో ఫోన్ 6.67-అంగుళాల క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s జన్ 3 చిప్‌సెట్‌తో 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో వస్తుంది. కెమెరా, వీడియో కాలింగ్ విషయానికి వస్తే.. వివో T4 5Gలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ప్రైమరీ సెన్సార్ 50MP, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో వస్తుంది.
Read Also : Jio Free Gold : జియో యూజర్లకు పండగే.. అక్షయ తృతీయకు ముందే జియో ‘ఫ్రీ గోల్డ్’ ఆఫర్.. ఇప్పుడే ఇలా కొనేసుకోండి!
అదే సమయంలో, ఈ ఫోన్ సెకండరీ కెమెరా 2MP కలిగి ఉంది. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. పవర్ కోసం ఈ ఫోన్ 7300mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. సెక్యూరిటీ విషయానికి వస్తే.. ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంది.