Vivo T4 Lite 5G
Vivo T4 Lite 5G : వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌లో వివో T4 లైట్ 5G ఫోన్ భారీ తగ్గింపు పొందింది. రూ.12వేల బడ్జెట్‌లో 5G కనెక్టివిటీ, ఫీచర్లతో వివో ఫోన్ లభ్యమవుతుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్‌లో వివో T4 లైట్ 5G ఫోన్ చౌకైన ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈ వివో ఫోన్ కొనుగోలుపై ఏకంగా రూ. 4వేలు తగ్గింపు పొందవచ్చు.
అలాగే, 8జీబీ ర్యామ్‌తో ఉండగా (Vivo T4 Lite 5G) మొత్తం 16GB ర్యామ్ వరకు విస్తరించుకోవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000mAh లాంగ్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమన్షిటీ 6300 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో బిగ్ స్క్రీన్ ఉంది. వివో T4 లైట్ 5G ఫోన్ కొనుగోలు చేసే ముందు ఫీచర్లు, ధర వివరాలు ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేయండి.
వివో T4 లైట్ 5జీపై భారీ తగ్గింపు :
భారత మార్కెట్లో వివో T4 లైట్ 5G ఫోన్ రూ.14,999 ధరకు లాంచ్ అయింది. కానీ, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్‌లో 26శాతం ధర తగ్గింపుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ. 10,999కి కొనుగోలు చేయవచ్చు. తద్వారా రూ.4వేలు సేవ్ చేసుకోవచ్చు. మీరు యాక్సస్ బ్యాంకు ఫ్లిప్‌కార్ట్ డెబిట్ కార్డులు లేదా ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై 5శాతం వరకు అదనంగా సేవ్ చేసుకోవచ్చు. మీ పాత ఫోన్ ఉంటే.. వివో T4 లైట్ 5G ఫోన్‌తో ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. తద్వారా వివో ఫోన్ రూ.10,490 తగ్గింపుతో పొందవచ్చు.
డిస్‌ప్లే, డిజైన్ :
వివో T4 లైట్ 5G ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్‌తో వస్తుంది. స్మూత్ స్క్రోలింగ్ అందిస్తుంది. 1000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. నేరుగా సూర్యకాంతిలో కూడా క్లియర్ స్ర్కీన్ అందిస్తుంది. ఈ ఫోన్ మెటల్ మ్యాట్ ఫ్రేమ్‌తో మినిమలిస్ట్ డిజైన్‌తో వస్తుంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంటుంది. దుమ్ము, నీటి నిరోధకతకు ఐపీ64 రేటింగ్ కూడా పొందవచ్చు. మిలిటరీ-గ్రేడ్ మన్నిక టెస్టులలో పాస్ అయింది.
వివో T4 లైట్ 5G ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 6300 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. హై-ఎండ్ టాస్కులకు బెస్ట్ ఫోన్. 8GB వరకు ర్యామ్, 8GB వరకు ఎక్స్ పాండబుల్ ర్యామ్ సపోర్టు ఇస్తుంది. మీరు ఈ ఫోన్‌లో 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజీని 2TB వరకు విస్తరించవచ్చు. ఈ ఫోన్ 6000mAh లాంగ్ బ్యాటరీ ప్యాక్‌తో కూడా అమర్చబడి ఉంది. సాధారణ వినియోగంలో రెండు నుంచి 3 రోజుల బ్యాటరీ బ్యాకప్ పొందవచ్చు. 15W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్‌తో ఈ ఫోన్‌ను త్వరగా ఛార్జ్ చేయవచ్చు.
కెమెరా సెటప్ :
బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సిస్టమ్ కలిగి ఉంది. ఇందులో సోనీ ఏఐతో కూడిన 50MP మెయిన్ కెమెరా, డెప్త్ సెన్సింగ్ కోసం 2MP బోకె లెన్స్ ఉన్నాయి. అయితే, ఫ్రంట్ సైడ్ క్లియర్ సెల్ఫీలు, వీడియోల కోసం 5MP సెల్ఫీ కెమెరా పొందవచ్చు. కెమెరా ఫీచర్లతో ఫొటోలో అవసరంలేని పార్ట్స్ రిమూవ్ చేసేందుకు ఏఐ ఎరేస్, ఇమేజ్ క్వాలిటీ కోసం ఏఐ ఫోటో ఎన్‌హాన్స్, డాక్యుమెంట్ స్కానింగ్, రీడింగ్ కోసం అల్ట్రా HD డాక్యుమెంట్ మోడ్ వంటి అనేక ఏఐ ఫీచర్లకు సపోర్టు ఇస్తుంది.