Samsung Galaxy S26 Ultra : కొత్త శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోందోచ్.. ఫీచర్లు ఓ రేంజ్‌లో ఉన్నాయి భయ్యా.. ఫుల్ డిటెయిల్స్!
Samsung Galaxy S26 Ultra : శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ రాబోతుంది. జనవరి 26 నాటికి ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Samsung Galaxy S26 Ultra
Samsung Galaxy S26 Ultra : కొత్త శాంసంగ్ ఫోన్ రాబోతుంది. సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి అతి త్వరలో నెక్ట్స్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా రాబోతుంది. ఈ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్లతో రానుంది.
ఈ శాంసంగ్ ఫోన్ ఇతర శాంసంగ్ గెలాక్సీ S26 ఎడ్జ్, శాంసంగ్ గెలాక్సీ S26 ప్రో సహా (Samsung Galaxy S26 Ultra) సిరీస్‌లోని మరో 2 ఫోన్‌లతో పాటు వస్తుంది. ఈ సిరీస్‌లోని ఫ్లాగ్‌షిప్ ఫోన్ కెమెరా సెగ్మెంట్ భారీ మార్పుతో సరికొత్త స్నాప్‌డ్రాగన్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ అందించనుంది. లీక్‌ల ఆధారంగా రాబోయే ఫ్లాగ్‌షిప్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లను ఓసారి వివరంగా పరిశీలిద్దాం..
భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ధర, లాంచ్ డేట్ :
సాధారణంగా ప్రతి ఏడాది జనవరిలో శాంసంగ్ గెలాక్సీ S సిరీస్ ఫోన్‌లను లాంచ్ చేస్తుంది. దక్షిణ కొరియా దిగ్గజం కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తే.. జనవరి 26 నాటికి శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా లైనప్‌లోని ఇతర ఫోన్‌లతో పాటు ప్రపంచ మార్కెట్లోకి రావొచ్చు.
ధరల విషయానికి వస్తే.. 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ 12GB ర్యామ్ వేరియంట్ రూ. 1,59,999 ధరకు భారత మార్కెట్లో లాంచ్ చేయవచ్చు. అయితే, శాంసంగ్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదని గమనించాలి.
శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా డిజైన్, కెమెరా, స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ డిజైన్ భారీ మార్పుతో వస్తుందని అంచనా. శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 7 మాదిరి కెమెరా ఐలాండ్ వంటి ఎన్‌క్లోజర్‌ను తీసుకురానుంది. శాంసంగ్ ఈసారి కూడా సన్నని ఫోన్ తీసుకువచ్చే అవకాశం ఉంది. శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 6.9-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే కలిగి ఉంటుంది.
ఇంకా, లీక్‌లను పరిశీలిస్తే.. ఈ శాంసంగ్ ఫోన్ 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది.క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో రన్ అవుతుందని సూచిస్తున్నాయి.
60W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు 5500mAh బ్యాటరీ కూడా ఉండవచ్చు. ఆప్టిక్స్ పరంగా పరిశీలిస్తే.. శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ముందున్న (ISOCELL)కి బదులుగా 200MP సోనీ స్నాపర్‌తో సహా క్వాడ్ రియర్ కెమెరా స్టమ్ కలిగి ఉండవచ్చు. ఇతర సెన్సార్లలో 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో షూటర్, 12MP టెలిఫోటో షూటర్ ఉండవచ్చు.