నవంబర్ 28 నుంచి సేల్ : భారీ బ్యాటరీతో Vivo U20 వచ్చేసింది

  • Publish Date - November 23, 2019 / 09:27 AM IST

చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ వివో నుంచి భారత మార్కెట్లో కొత్త స్మార్ట్ ఫోన్ Vivo U20 లాంచ్ అయింది. 5,000mAh భారీ బ్యాటరీ సామర్థ్యంతో పాటు ట్రిపుల్ కెమెరాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. Vivo U10 స్మార్ట్ ఫోన్‌తో సక్సెస్ సాధించిన వివో U సిరీస్ నుంచి మరో U20 మోడల్ మార్కెట్లోకి తీసుకొచ్చింది.

ఈ స్మార్ట్ ఫోన్ హై ఫీచర్లలో 6.53 అంగుళాల Full HD+ డిస్‌ప్లే, వాటర్ డ్రాప్ స్టయిల్ నాచ్ ఫ్రంట్ డిజైన్ బాగుంది. 6GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజీతో స్నాప్ డ్రాగన్ 675 AIE ప్రాసెసర్ అమర్చారు. దీనికి అదనంగా మైక్రోSD కార్డు సాయంతో మెమెరీ సామర్థ్యాన్ని 256GB వరకు పొడిగించుకోవచ్చు. 18W ఫాస్ట్ చార్జింగ్ తో 5,000mAh బ్యాటరీ రన్ అవుతుంది. ఇక కెమెరాల విషయానికి వస్తే.. ట్రిపుల్ కెమెరాలు స్పెషల్ ఎట్రాక్షన్ గా చెప్పవచ్చు. 

16MP ప్రైమరీ కెమెరా సెన్సార్, 8MP సూపర్ వైడ్ యాంగిల్ లెన్స్, 2MP సూపర్ మ్యాక్రో లెన్స్ ఫ్రంట్ ఇచ్చింది. డివైజ్ పైభాగంలో 16MP సెల్ఫీ షూటర్ తో ఈజీగా సెల్ఫీలు తీసుకోనేలా ఉంది. Vivo U20 స్మార్ట్ ఫోన్ ఈకామర్స్ వెబ్ సైట్, వివో ఈ-స్టోర్లలో అందుబాటులో ఉంది. నవంబర్ 28 నుంచి ఆన్ లైన్ సేల్ ప్రారంభం కానుంది. 4GB ర్యామ్, 6GB ర్యామ్ వేరియంట్ల ధర రూ.10వేల 999, రూ.11వేల 999లతో లభ్యం కానుంది.

ఈ రెండు వేరియంట్లు 64GB ఇంటర్నల్ స్టోరేజీ అమర్చారు. రేసింగ్ బ్లాక్, బ్లేజ్ బ్లూ రెండు రంగుల్లో ఈ మోడల్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వివో కంపెనీ Vivo U20 ఫోన్‌పై లాంచ్ ఆఫర్లు ప్రకటించింది. ప్రీపెయిడ్ ఆర్డర్లపై రూ.1000 వరకు తగ్గింపు అందిస్తోంది. రిలయన్స్ జియోతో కలిసి రూ.6వేల విలువైన బెనిఫెట్స్ అందిస్తోంది. అదనంగా 6 నెలల EMI కొనుగోలుపై నో కాస్ట్ EMI ఆఫర్ చేస్తోంది.