Vivo V30e Fast 5G
Vivo V30e Price : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? వివో V30e ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. అద్భుతమైన ఫీచర్లతో కొనుగోలుదారులను ఆకట్టుకునేలా ఉంది. మన్నికతో పాటు ఫీచర్ల పరంగా వివో V30e గత వెర్షన్ల మాదిరిగానే ఉంటుంది.
వివో 5G నెట్‌వర్క్‌ను యాక్సెస్ చేసే బడ్జెట్-ఫ్రెండ్లీ ఉన్న వినియోగదారుల కోసమే రూపొందించారు. ఈ వివో ఫోన్ చౌకైన ధరకు అందిస్తుంది. వివో V30e స్పెసిఫికేషన్లు మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.
వివో V30e డిస్‌ప్లే, డిజైన్ :
2400 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో అద్భుతమైన 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియా, గేమింగ్ లేదా రోజువారీ టాస్కులకు సపోర్టు చేస్తుంది. అల్ట్రా-స్మూత్ స్క్రోలింగ్, యానిమేషన్ ఈవెంట్స్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో రన్ అవుతాయి.
మొబిలిటీ, ఆధునిక ప్రీమియం డిజైన్‌తో అద్భుతమైన వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. క్యారీ చేయడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. వివో V30e డిస్‌ప్లే మీరు సినిమాలు చూస్తున్నా, ఆటలు ఆడుతున్నా లేదా బ్రౌజ్ చేస్తున్నా ఆకర్షణీయమైన ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.
వివో V30e పర్ఫార్మెన్స్, స్టోరేజీ :
వివో V30e క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. రోజువారీ టాస్కులకు బెస్ట్ ఫోన్ కూడా ఈ ఫోన్ 8GB ర్యామ్, 128/256GB స్టోరేజీ ఆప్షన్లతో వస్తుంది. యాప్‌లు, గేమ్‌లు, అనేక ఫోటోలు, వీడియోల కోసం తగినంత స్టోరేజీ పొందవచ్చు. ఎక్కువ స్టోరేజీ కోరుకునే కొనుగోలుదారుల కోసం వివో V30e ఫోన్‌లో మైక్రో SD కార్డ్ స్లాట్‌తో వస్తుంది.
వివో V30e కెమెరా, ఫీచర్లు :
వివో V30e ఫోన్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. f/1.79 అపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. 50MP ప్రైమరీ సెన్సార్ లో లైటింగ్ కండిషన్లలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది.
అల్ట్రా-వైడ్ యాంగిల్ సింగిల్ షాట్‌లో ల్యాండ్‌స్కేప్ ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు. ఫ్రంట్ సైడ్ వివో V30e ఫోన్ 50MP కెమెరా (భారత్) లేదా 32MP కెమెరా (మలేషియాలో) కలిగి ఉంది. ఫ్రంట్ కెమెరాలు క్రిస్పీ, కలర్‌ఫుల్ సెల్ఫీలను తీయొచ్చు. అదనంగా, ఫ్రంట్ కెమెరా 4K వద్ద వీడియోలను షూట్ చేయొచ్చు. వ్లాగర్లు, కంటెంట్ క్రియేటర్లకు సరైన ఫోన్ అని చెప్పవచ్చు.
వివో V30e బ్యాటరీ, ఛార్జింగ్ :
వివో V30e ఫోన్ 5500mAh బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. భారీ బ్యాటరీతో వీడియోలను స్ట్రీమింగ్ చేయడం, గేమింగ్ ఆడటం లేదా బ్రౌజింగ్ చేయడం వంటి టాస్కులను వేగంగా పూర్తి చేయొచ్చు. అదనంగా, ఈ వివో ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జింగ్‌ను కలిగి ఉంటుంది. మీరు త్వరగా ఫోన్ ఛార్జ్ చేయొచ్చు. ఎక్కువ సమయం వినియోగించుకోవచ్చు. బ్యాటరీతో పాటు ఫాస్ట్ ఛార్జ్ కాంబోతో మీకు రోజంతా ఛార్జింగ్ వస్తుంది.
వివో V30e ధర, డీల్స్ :
వివో V30e ఫోన్ అత్యంత ఆకర్షణీయమైన ధరకు వస్తుంది. కేవలం రూ. 25,999 ధరకు లభ్యం అవుతుంది. కొన్ని ప్రాంతాలలో వివో V30e భారీ తగ్గింపు ధరకు లభిస్తుంది. ఆన్‌లైన్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, బ్యాంక్ ప్రమోషన్‌లతో తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు.