Vivo V50 Discount
Vivo V50 Discount : కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అద్భుతమైన ఫీచర్లతో కూడిన వివో V50 5G ఫోన్ అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వివో V50 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది.
లాంచ్ అయిన ఒక నెలలోనే ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో ఈ వివో 5G ఫోన్ అందుబాటులో ఉంది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ వివో V50 ఫోన్ కేవలం రూ. 19,999 ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ డీల్‌ను మీరు ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
వివో V50పై భారీ డిస్కౌంట్ :
వివో స్మార్ట్‌ఫోన్ 8GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.36,999కు ఆఫర్ చేస్తోంది. కానీ, వివో V50 ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ ద్వారా అన్ని బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ.3వేల డిస్కౌంట్ అందిస్తోంది. దాంతో ప్రస్తుత వివో V50 ధర రూ.33,999కి తగ్గుతుంది.
ఫ్లిప్‌కార్ట్ రూ.35,350 వరకు ఆకట్టుకునే ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా అందిస్తోంది. మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్‌కు రూ.15వేలు ఎక్స్ఛేంజ్ చేస్తే.. రూ.18,999 ధరకే వివో V50ని సొంతం చేసుకోవచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్ వాల్యూ అనేది మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి.
వివో V50 స్పెసిఫికేషన్లు :
వివో V50 ఫోన్ మొత్తం 3 టైటానియం గ్రే, స్టార్రి నైట్, రోజ్ రెడ్ ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో వస్తుంది. IP68, IP69 రేటింగ్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ వాటర్, డస్ట్ నిరోధిస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా FuntouchOS 15పై రన్ అవుతుంది.
UFS 2.2 ద్వారా 512GB గరిష్ట స్టోరేజీ సామర్థ్యంతో పాటు 12GB వరకు LPDDR4X RAMకి సపోర్టు ఇస్తుంది. ఈ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన 6.77-అంగుళాల 3D కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz హై రిఫ్రెష్ రేట్, 2392 x 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంది.
Read Also : IPL Fans : జియో IPL ఆఫర్ అదుర్స్.. కేవలం రూ.100కే హైస్పీడ్ డేటా, 90 రోజులు మ్యాచ్‌లు ఫ్రీగా చూడొచ్చు!
ఆకట్టుకునే 4,500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్ లెవల్స్ అందిస్తుంది. వివో ఫోన్ బ్యాక్ సైడ్ వివో V50 డ్యూయల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ ఆటోఫోకస్ కెమెరా 50MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో వస్తుంది.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం అద్భుతమైన 50MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా కూడా ఉంది. అదనపు ఫీచర్లలో USB టైప్-C కనెక్టివిటీ, Wi-Fi సపోర్టు ఉన్నాయి. 90W ఫాస్ట్ ఛార్జింగ్ అందించే 6,000mAh బ్యాటరీతో రోజంతా ఛార్జింగ్ వస్తుంది.