Vivo V50e 5G Sale
Vivo V50e 5G Sale : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు వివో ఇటీవలే వివో V50e 5G ఫోన్ భారత టెక్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ కంపెనీ మిడ్-రేంజ్ ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌లో ఆఫర్ చేస్తోంది.
మీ బడ్జెట్ రూ. 30 వేలు స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తుంటే.. ఈ ఫోన్ మీకు బెస్ట్ ఆప్షన్ కావచ్చు. ఈ వివో ఫోన్ విషయానికి వస్తే.. వివో V50e 5G ప్రీ-బుకింగ్ ప్రారంభించింది. మంచి డిస్కౌంట్ ఆఫర్‌లో ఈ వివో 5జీ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. మీరు ఈ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ను చౌకైన ధరకు ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వివో V50e 5G ప్రీ-ఆర్డర్ బుకింగ్ :
భారత మార్కెట్లో ఏప్రిల్ 17, 2025 నుంచి వివో V50e 5జీ సేల్ ప్రారంభం కానుంది. మీరు ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ నుంచి వివో V50e 5G ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుంచి కూడా కొనుగోలు చేయవచ్చు.
వివో వివో V50e 5G రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8GB + 128GB వేరియంట్, 8GB + 256GB వేరియంట్ ఉన్నాయి. ధర విషయానికి వస్తే.. 128GB వేరియంట్ ధర రూ. 33,999కు పొందవచ్చు. 256GB వేరియంట్ ధర రూ. 28,999కు పొందవచ్చు. వివో ఫస్ట్ సేల్ ఆఫర్‌లో రూ. 5 వేల వరకు ఆదా చేయవచ్చు.
Vivo V50e 5G ఫీచర్లు :
ఈ ఫోన్‌లో కంపెనీ 6.77-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను అందించింది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ ఫోన్ 1800 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్‌తో వస్తుంది. 8GB వరకు ర్యామ్, 256GB స్టోరేజీ ఆప్షన్లతో వస్తుంది. అదే సమయంలో, IP68, IP69 రేటింగ్‌లతో వస్తుంది.
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. OIS సపోర్టుతో వస్తుంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 50MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. 5600mAh బ్యాటరీని కలిగి ఉంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులో ఉంది.