Vivo X100 Pro Price
Vivo X100 Pro Price : వివో కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ కోసం చూస్తున్నారా? వివో ఫ్లాగ్‌షిప్ X100 ప్రో భారీగా తగ్గింది. ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 36వేల కన్నా భారీ (Vivo X100 Pro Price) తగ్గింపుతో అందుబాటులో ఉంది. అంటే.. రూ. 54వేలు ధరకు తగ్గింపు పొందింది.
గత ఏడాదిలో రూ. 89,999 అసలు ధరకు లాంచ్ కాగా, పవర్‌ఫుల్ డైమెన్సిటీ 9300 చిప్‌సెట్, కర్వడ్ అమోల్డ్ డిస్‌ప్లే, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు భారీ బ్యాటరీని కూడా కలిగి ఉంది. మీరు ఫ్లాగ్‌షిప్ కెమెరా ఫోన్ కోసం చూస్తుంటే.. వివో X100 ప్రో బెస్ట్ డీల్ అసలు వదులుకోవద్దు. ఇంతకీ, మీరు ఈ డీల్‌ను ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
అమెజాన్‌లో వివో X100 ప్రో ధర :
ప్రస్తుతం వివో X100 ప్రో 5G ఫోన్ రూ.54,990కి అమ్ముడవుతోంది. లాంచ్ ధర రూ.89,999 నుంచి రూ.35,009 తగ్గింది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు రూ.1,500 తగ్గింపు పొందవచ్చు. ఈ వివో ఫోన్ ధర రూ.53,490కి తగ్గుతుంది. ఇంకా, అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో 5శాతం నెలకు ఈఎంఐ 1,649 వరకు, 5శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు.
అంతే కాదు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందిస్తోంది. మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే.. రూ. 33,350 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూను పొందవచ్చు. ఈ డీల్ 16GB ర్యామ్, 512GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌తో ఆస్టరాయిడ్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.
వివో X100 ప్రో స్పెసిఫికేషన్లు :
వివో X100 ప్రో 5G ఫోన్ అద్భుతమైన 6.78-అంగుళాల LTPO కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో అందిస్తుంది. హుడ్ కింద ఈ ఫోన్ 16GB వరకు ర్యామ్, 512GB స్టోరేజీతో వస్తుంది. డైమెన్సిటీ 9300 చిప్‌సెట్‌ను అందిస్తుంది.
ఆప్టిక్స్ పరంగా చూస్తే వివో X100 ప్రో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో ZEISS-ట్యూన్ 50MP సోనీ IMX989 సెన్సార్, 50MP వైడ్-యాంగిల్ కెమెరా, OISతో 50MP టెలిఫోటో లెన్స్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ OS 14పై రన్ అవుతుంది. అదనంగా, వివో X100 ప్రో 100W ఫ్లాష్‌ఛార్జ్ సపోర్ట్‌తో 5,400mAh బ్యాటరీతో వస్తుంది.