క్రికెట్ పిచ్‌పై తన బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించే జస్‌ప్రీత్ బుమ్రాతో ప్రముఖ జర్మన్ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ జతకట్టింది. వోక్స్‌వ్యాగన్ ఇండియా తమ ఐకానిక్ హాట్ హ్యాచ్ Golf GTI ప్రమోషన్ కోసం టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాతో పార్ట్‌నర్‌షిప్‌ను ప్రకటించింది.
దీనిపై వోక్స్‌వ్యాగన్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ నితిన్ కోహ్లీ మాట్లాడుతూ.. “బుమ్రా, Golf GTI.. తమ తమ రంగాల్లో గేమ్ ఛేంజర్స్. బుమ్రా తన యార్కర్లతో ఆటను ఎలా మలుపు తిప్పుతాడో, Golf GTI తన అద్భుతమైన పనితీరుతో డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అలానే మారుస్తుంది. ఈ పవర్-ప్యాక్డ్ ద్వయం. కచ్చితంగా కస్టమర్లను ఆకట్టుకుంటుంది” అని అన్నారు.
దీనిపై స్పందించిన జస్‌ప్రీత్ బుమ్రా.. “నిజమైన పెర్ఫార్మన్స్ అంటే ఏవో సౌండ్స్ చేయడం కాదు.. నిలకడగా ఉండాలి. వోక్స్‌వ్యాగన్ బ్రాండ్‌లో నేను ఎప్పుడూ మెచ్చుకునేది ఇదే. దాని స్టైల్, పెర్ఫార్మెన్స్, కచ్చితత్వం నాకు చాలా సహజంగా అనిపించాయి. ఈ ప్రయాణంలో భాగమైనందుకు గర్వంగా ఉంది” అని తెలిపారు.
Volkswagen Golf GTI స్పెసిఫికేషన్లు
దీనిని “హాట్ హ్యాచ్” అని ఎందుకు అంటారో ఈ స్పెసిఫికేషన్లు చూస్తే అర్థమవుతుంది.
ఫీచర్ | స్పెసిఫికేషన్ |
---|---|
ధర (Price) | సుమారు రూ.53 లక్షలు (ఎక్స్-షోరూమ్) |
ఇంజిన్ (Engine) | 2.0-లీటర్, 4-సిలిండర్ టర్బో పెట్రోల్ |
పవర్ (Power) | 265 hp |
టార్క్ (Torque) | 370 Nm |
ట్రాన్స్‌మిషన్ (Transmission) | 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ (DSG) |
వేగం (0-100 km/h) | కేవలం 5.9 సెకన్లలో |
గరిష్ట వేగం (Top Speed) | 267 km/h |
ఈ కారులో ఉన్న ఎలక్ట్రానిక్ ఫ్రంట్ యాక్సిల్ డిఫరెన్షియల్ లాక్, మలుపుల్లో కూడా అద్భుతమైన గ్రిప్, స్టెబిలిటీని అందిస్తుంది.
Golf GTI కారు కేవలం 5.9 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
జస్‌ప్రీత్ బుమ్రా లాంటి క్రీడాకారుడిని బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకోవడం ద్వారా వోక్స్‌వ్యాగన్ తన స్పోర్టీ, పెర్ఫార్మెన్స్-ఓరియెంటెడ్ కార్లను భారత యువతకు, కార్ ప్రియులకు మరింత దగ్గర చేసే ప్రయత్నం చేస్తోంది.