Volkswagen Taigun Launch : వోక్స్‌వ్యాగన్ టైగన్ ట్రయల్ ఎడిషన్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

Volkswagen Taigun : వోక్స్‌వ్యాగన్ టైగన్ ట్రైల్ ఎడిషన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 1.5-లీటర్ టీఎస్ఐ ఈవీఓ ఇంజన్‌ను ఉపయోగిస్తుంది.

Volkswagen Taigun Trail edition launched in India at Rs 16.29 lakh

Volkswagen Taigun Launch : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ ఇండియా (Volkswagen India) వోక్స్‌వ్యాగన్ టైగన్ ట్రైల్ ఎడిషన్‌ను రూ. 16.29 లక్షలు (ఎక్స్-షోరూమ్)  లాంచ్ చేసింది. 11 విభిన్న ఫీచర్లు, ట్రైల్-ప్రేరేపిత డిజైన్ అంశాలతో లోడ్ చేసిన ఈ స్పెషల్ ఎడిషన్ మోడల్ జీటీ ఎడ్జ్ లిమిటెడ్ కలెక్షన్ కింద ఆన్‌లైన్‌లో బుకింగ్‌ల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉంది. ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ట్రైల్ ఎడిషన్‌లో ట్రైల్-ఇన్‌స్పైర్డ్ బాడీ సైడ్ గ్రాఫిక్స్, బ్లాక్ రూఫ్ ఫాయిల్, వెనుక వైపున ట్రైల్ బ్యాడ్జ్, బ్లాక్ కలర్ డోర్ గార్నిష్, బ్లాక్ ఓవిఆర్‌ఎమ్‌లు రెడ్ యాక్సెంట్‌లు, బ్లాక్ బెల్మాంట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

Read Also : Pixel Car Crash Detection : భారత్‌‌లో ఈ పిక్సెల్ ఫోన్లలో కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్‌.. ఎలా ఎనేబుల్ చేయాలి? అదేలా పనిచేస్తుందంటే?

ఇందులో మూడు ఎక్స్‌ట్రనల్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. కాండీ వైట్, రిఫ్లెక్స్ సిల్వర్ కార్బన్ స్టీల్ గ్రేతో వస్తుంది. క్యాబిన్ లోపల, ట్రైల్-థీమ్ సీట్ కవర్లు, పుడ్ల్ ల్యాంప్స్, స్పోర్టీ ఫుట్ పెడల్స్‌ను పొందవచ్చు. టైగన్ ట్రైల్ ఎడిషన్‌లో డ్యుయల్ కెమెరాలతో కూడిన డాష్‌క్యామ్, ఇన్‌బిల్ట్ 5.08cm IPS LCD ఉంది. డాష్‌క్యామ్ ఈ కింది ఫీచర్లను కలిగి ఉంది.

Volkswagen Taigun Trail edition launched in India

* 140-డిగ్రీల అల్ట్రా-వైడ్ వ్యూయింగ్ యాంగిల్ (ఫ్రంట్ లెన్స్)
* లూప్ రికార్డింగ్
* ఇంపాక్ట్ సెన్సార్
* మోషన్ డిటెక్షన్
* పార్కింగ్ మానిటరింగ్
* 6 IR లైట్లతో లో లక్స్ రికార్డింగ్ సామర్ధ్యం
* ఇంజిన్ స్టార్టింగ్ ఆటోమేటిక్ రికార్డింగ్
* ఫొటో క్యాప్చర్, ప్లేబ్యాక్

వోక్స్‌వ్యాగన్ టైగన్ ట్రైల్ ఎడిషన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో చేసిన 1.5-లీటర్ టీఎస్ఐ ఈవీఓ ఇంజన్‌ను ఉపయోగిస్తుంది. ఈ పెట్రోల్ మోటార్ గరిష్టంగా 150పీఎస్ పవర్, 250ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది. ఈ పండుగ సీజన్‌లో, టైగన్ ట్రైల్ ఎడిషన్ కాంటాక్టులతో వినియోగదారులకు అందిస్తున్నాం. 1.5-లీటర్ టీఎస్ఐ ఈవీఓ ద్వారా ఆధారితంగా ఎస్‌యూవీ కఠినమైన డిజైన్ స్పోర్టినెస్‌ను ప్రదర్శిస్తుంది. జీటీ ఎడ్జ్ కలెక్షన్‌, యూజర్ల కోసం ఆప్షన్లను విస్తరిస్తున్నామని ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా తెలిపారు.

Read Also : Google Pixel 8 Pro Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? గూగుల్ పిక్సెల్ 8 ప్రోపై అదిరే డిస్కౌంట్.. బ్యాంకు ఆఫర్లతో మరింత తగ్గింపు..!