Post Office Scheme : పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇలా పెట్టుబడి పెడితే కేవలం 115 నెలల్లోనే మీ డబ్బు డబుల్ అవుతుంది..!

Post Office Scheme : పోస్టాఫీసులో అద్భుతమైన పథకం. కిసాన్ వికాస్ పత్ర (KVP)లో పెట్టుబడితో 115 నెలల్లోనే పెట్టిన డబ్బు రెండింతలు అవుతుంది.

Post Office Scheme

Post Office Scheme : కొత్తగా పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారా? ఎందులో పెట్టుబడి పెట్టాలా? అని ఆలోచిస్తు్న్నారా? పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టడం ద్వారా అద్భుతమైన (Post Office Scheme) రాబడిని పొందవచ్చు. ఈ పథకంలో మీ డబ్బుకు భద్రతతో పాటు అధిక మొత్తంలో వడ్డీ రేట్లు పొందవచ్చు.

పోస్టాఫీసు అన్ని వయసుల వారికి ఆదాయ వర్గాల వారికి వివిధ చిన్న పొదుపు పథకాలను అందిస్తుంది. కిసాన్ వికాస్ పత్ర (KVP) పథకంలో పెట్టుబడితో మీ డబ్బు కేవలం 115 నెలల్లో రెట్టింపు అవుతుంది. ఇంతకీ, ఈ పథకంలో ఎలా పెట్టుబడి పెట్టాలి? ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

కేవలం రూ. 1,000తో పెట్టుబడి :
మీరు కిసాన్ వికాస్ పత్ర (KVP) పథకంలో కేవలం రూ. 1,000తో పెట్టుబడి పెట్టవచ్చు. భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా జీవించవచ్చు. పోస్టాఫీసు పథకాల్లో KVP పథకం ఒకటి. మీరు పెట్టుబడి పెట్టే డబ్బు పూర్తిగా సురక్షితం. ఈ పథకంలో మీ డబ్బుకు ప్రభుత్వం పూర్తి గ్యారెంటీ ఇస్తుంది. ఈ పథకంలో పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు. కావలసినంత డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు.

ప్రతి ఏడాది 7.5శాతం వడ్డీ :
ఈ పోస్టాఫీసు పథకంలో భారీ వడ్డీ రేటును కూడా పొందవచ్చు. ప్రస్తుతం, వడ్డీ రేటు ఏడాదికి 7.5 శాతం అందిస్తుంది. వడ్డీ వార్షిక ప్రాతిపదికన పొందవచ్చు. ఈ పథకం కాల వ్యవధి 115 నెలలు ఉంటుంది. దాదాపు 9 ఏళ్ల 7 నెలలు. ఈ వ్యవధి తర్వాత మీ డబ్బు రెట్టింపు అవుతుంది. మీరు మీ పేరుతో ఒకే అకౌంట్ ఓపెన్ చేయొచ్చు లేదా ఈ పథకం కింద మీరు మరొకరితో కలిసి జాయింట్ అకౌంట్ కూడా ఓపెన్ చేయొచ్చు.

Read Also : Best 5 Family Cars : కొత్త కారు కొంటున్నారా? 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో బెస్ట్ 5 ఫ్యామిలీ కార్లు ఇవే.. ఏది కొంటారో మీ ఇష్టం..!

మరో విషయం ఏమిటంటే.. పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్లపై ఎలాంటి పరిమితి లేదు. ఒక వ్యక్తి అవసరమైన KVP అకౌంట్లను ఓపెన్ చేయొచ్చు. మీరు రెండు అకౌంట్లను ఓపెన్ చేయాలంటే.. మీరు రెండు కన్నా ఎక్కువ అకౌంట్లను కూడా ఓపెన్ చేయొచ్చు. అలాగే, 10 ఏళ్ల కన్నా ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.

మీ డబ్బు ఎలా రెట్టింపు అవుతుందంటే? :
ఈ పోస్టాఫీసు పథకంలో పెట్టుబడి పెట్టిన డబ్బు రెట్టింపు అవుతుంది. ప్రతి ఏడాదిలో వడ్డీ అసలు మొత్తానికి జమ అవుతుంది. దీన్నే కాంపౌండ్ వడ్డీ అంటారు. మీరు రూ. లక్ష పెట్టుబడి పెడితే.. ఏడాది తర్వాత రూ. 7,500 వడ్డీ వస్తుంది. ఈ వడ్డీ అసలు మొత్తానికి జమ అవుతుంది. మొత్తంగా రూ. 1,07,500 అవుతుంది. రెండో ఏడాదిలో రూ. 1,07,500పై 7.5 శాతం వడ్డీతో మొత్తానికి రూ. 8,062 వడ్డీ జమ అవుతుంది.

మీ మొత్తం డబ్బు రూ. 1,15,562 అవుతుంది. ప్రతి ఏడాది పెట్టుబడిపై మొత్తం పెరుగుతూనే ఉంటుంది. 115 నెలల తర్వాత రూ. లక్ష నుంచి రూ.2 లక్షలు అవుతుంది. రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే.. మెచ్యూరిటీ సమయంలో రూ. 10 లక్షలు పొందవచ్చు.