Best 5 Family Cars : కొత్త కారు కొంటున్నారా? 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో బెస్ట్ 5 ఫ్యామిలీ కార్లు ఇవే.. ఏది కొంటారో మీ ఇష్టం..!

Best 5 Family Cars : 2025లో భారత మార్కెట్లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ కలిగిన అత్యుత్తమ 5 ఫ్యామిలీ కార్లు ఉన్నాయి.. అవేంటో ఓసారి లుక్కేయండి..

Best 5 Family Cars : కొత్త కారు కొంటున్నారా? 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో బెస్ట్ 5 ఫ్యామిలీ కార్లు ఇవే.. ఏది కొంటారో మీ ఇష్టం..!

Best 5 Family Cars

Updated On : July 6, 2025 / 4:30 PM IST

Best 5 Family Cars : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? భారత మార్కెట్లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో బెస్ట్ 5 ఫ్యామిలీ కార్లు అందుబాటులో ఉన్నాయి. అద్భుతమైన ఫీచర్లతో ఫ్యామిలీ కస్టమర్లను ఆకర్షించేలా ఉన్నాయి. 2025 మోడల్ ఇంజిన్లలో GCAP క్రాష్ టెస్ట్ ద్వారా భారత్‌లో కొన్ని కార్లు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ కలిగి ఉన్నాయి. క్వాలిటీ, ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌లు (ABS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP) వంటి ఇతర ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి.

టాటా పంచ్ (కాంపాక్ట్ సిటీ-ఫ్రెండ్లీ), మహీంద్రా XUV 3XO (ఫీచర్-రిచ్ ), టాటా నెక్సాన్ (వైడ్, సేఫ్టీ SUV), హ్యుందాయ్ వెర్నా (స్టైల్‌తో సేఫ్టీ సెడాన్), స్కోడా కుషాక్/వోక్స్‌వ్యాగన్ టైగన్ (స్ట్రాంగ్, ఫ్రెండ్లీ డ్రైవింగ్ ) కార్లు ఉన్నాయి.

టాటా పంచ్ :
కాంపాక్ట్ SUV టాటా పంచ్ వరల్డ్ NCAP రేటింగ్ స్కేల్‌లో 5 స్టార్ కలిగి ఉంది. భారత మార్కెట్లో అత్యంత సురక్షితమైన చిన్న కార్లలో ఒకటిగా నిలిచింది. ఇందులో 2 ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో ABS, స్ట్రాంగ్ బాడీ షెల్ ఉన్నాయి చిన్న ఫ్యామిలీ ఇష్టపడే కార్లలో ఇదే బెస్ట్ మోడల్ కారు.

మహీంద్రా XUV 3XO :
మహీంద్రా XUV3XO కారు హై-ఎండ్ ఫీచర్లు కలిగి ఉంది. పనోరమిక్ సన్‌రూఫ్, భారీ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే టాప్ సేఫ్టీతో పాటు పాత XUV300 5-స్టార్ రేటింగ్ పొందింది. ఈ కొత్త వెర్షన్ మెరుగైన టెక్నాలజీ, స్ట్రాంగ్ క్వాలిటీతో వస్తుంది.

Read Also : 8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. గ్రేడ్ లెవల్ 1 నుంచి లెవల్ 10వరకు జీతం ఎంత పెరగనుందంటే?

టాటా నెక్సన్ :
భారత మార్కెట్లో టాటా నెక్సాన్ సేఫ్టీ స్టార్‌గా నిలిచింది. 5-స్టార్ రేటింగ్ కలిగి ఉంది. 2025 నెక్సాన్ ESP, ట్రాక్షన్ కంట్రోల్, మల్టీ ఎయిర్‌బ్యాగ్‌లు వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంది. రూ. 15 లక్షల లోపు ధరలో ఫ్యామిలీ SUV కారుగా చెప్పవచ్చు.

హ్యుందాయ్ వెర్నా :
గ్లోబల్ NCAP టెస్టింగ్‌లో హ్యుందాయ్ వెర్నా మాజికల్ 5-స్టార్ రేటింగ్ పొందింది. భారత మార్కెట్లో అత్యంత సేఫ్ సెడాన్, ఫీచర్-రిచ్ ఇంటీరియర్స్, విశాలమైన క్యాబిన్, బెస్ట్ రైడ్ క్వాలిటీతో వస్తుంది. ఫ్యామిలీ కస్టమర్లకు సేఫ్టీ, స్టయిల్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు కలిగి ఉంది.

స్కోడా కుషాక్ / వోక్స్‌వ్యాగన్ టైగన్ :
స్కోడా కుషాక్, VW టైగన్ రెండూ ఒకే ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్నాయి. అత్యధిక 5-స్టార్ రేటింగ్‌ పొందాయి. ఈ కార్లు చాలా స్ట్రాంగ్ ఉంటాయి. 6 ఎయిర్‌బ్యాగులు, ESC వంటి సేఫ్ క్రాష్ వంటి ఫీచర్లు కలిగి ఉన్నాయి.