8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. గ్రేడ్ లెవల్ 1 నుంచి లెవల్ 10వరకు జీతం ఎంత పెరగనుందంటే?

8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు భారీగా పెరగనున్నాయి. లెవల్ 1 నుంచి లెవల్ 10 వరకు వేతనాలు ఎంత పెరగొచ్చుంటే?

8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. గ్రేడ్ లెవల్ 1 నుంచి లెవల్ 10వరకు జీతం ఎంత పెరగనుందంటే?

8th Pay Commission

Updated On : July 6, 2025 / 3:48 PM IST

8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. 8వ వేతన సంఘం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కమిషన్  (8th Pay Commission) అమలుతో కేంద్ర ఉద్యోగుల వేతనం 20శాతం నుంచి 30శాతం వరకు పెరుగుతుందని భావిస్తున్నారు.

అయితే, ఏ గ్రేడ్ లెవల్ ఉద్యోగులకు ఎంత జీతం పెరుగుతుంది? ఫిట్‌మెంట్ కారకం ఏంటి? అనేది అసలు ప్రశ్న.. 8వ వేతన సంఘం నుంచి జీతాల పెంపుదల 50 లక్షలకు పైగా కేంద్ర ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు లభించనుంది.

ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. 8వ వేతన సంఘం ఏప్రిల్ 2025 నుంచి ప్రారంభమై జనవరి 1, 2026 నుంచి అమలు చేసే అవకాశం ఉంది. అయితే, దీనిపై క్లారిటీ లేదు. 7వ వేతన సంఘం జనవరి 1, 2016 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ వేతన సంఘం పదవీకాలం డిసెంబర్ 31, 2025 వరకు ఉంటుంది. సాధారణంగా ప్రతి 10 ఏళ్లకు ఒక కొత్త వేతన సంఘం అమల్లో వస్తుంది. 8వ CPC జనవరి 2026 నుంచి అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు.

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఏంటి? :
కేంద్ర ఉద్యోగుల బేసిక పే విషయంలో ఫిట్‌మెంట్ అంశం చాలా ముఖ్యం. 7వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ఉంది. ఫలితంగా బేసిక్ పే రూ.7వేలు నుంచి రూ.18వేలకి పెరిగింది. ఇప్పుడు 8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ గురించి 3 వేర్వేరు (1.92, 2.08, 2.86) అంచనాలు ఉన్నాయి. దీని ప్రకారమే.. ఉద్యోగుల కొత్త జీతం ఎంత ఉంటుందో నిర్ణయిస్తుంది. ఫిట్‌మెంట్ అంశం 2.86 అయితే, బేసిక్ పే రూ.18వేల నుంచి రూ.51,480కి పెరగవచ్చు.

లెవల్ 1 :
లెవల్ 1లో ప్యూన్లు, అటెండర్లు, సహాయక సిబ్బంది ఉన్నారు. వీరి కనీస వేతనం రూ.18,000 కాగా, రూ.51,480కి పెంచనున్నట్టు భావిస్తున్నారు. అంటే.. రూ.33,480 పెరిగే అవకాశం ఉంది.

లెవల్ 2 :
లెవల్ 2లో క్లరికల్ వర్క్ చేసే లోయర్ డివిజన్ క్లర్కులు ఉన్నారు. వారి కనీస వేతనం రూ.19,900 నుంచి రూ.37,014 పెరిగి రూ.56,914కి చేరుకునే అవకాశం ఉంది.

లెవల్ 3 :
లెవల్ 3లో రూ.21,700 ఉన్న కనీస వేతనాన్ని రూ.62,062కి పెంచాలని భావిస్తున్నారు. అంటే రూ.40,362 పెరగొచ్చు. ఈ లెవల్ కేటగిరీలో కానిస్టేబుళ్లు, పోలీసులు లేదా ప్రజా సేవలలో నైపుణ్యం కలిగిన ఉద్యోగులు ఉంటారు.

లెవల్ 4 :
లెవల్ 4లో గ్రేడ్ D స్టెనోగ్రాఫర్లు, జూనియర్ క్లర్కులు ఉన్నారు. వారి కనీస వేతనం రూ.25,500 నుంచి రూ.72,930కి పెరిగే అవకాశం ఉంది.. అంటే రూ.47,430 పెరగొచ్చు.

లెవల్ 5 :
లెవల్ 5లో రూ.29,200 ఉన్న కనీస వేతనాన్ని రూ.83,512కి పెంచవచ్చు. అంటే రూ.54,312 పెరుగుతుంది. ఈ లెవల్‌లో సీనియర్ క్లర్కులు, ఉన్నత స్థాయి టెక్నాలజీ ఉద్యోగులు ఉంటారు.

Read Also : PM Kisan Yojana : రైతులకు బిగ్ అప్‌డేట్.. అతి త్వరలో 20వ విడత విడుదల.. లబ్ధిదారు జాబితాలో మీ పేరు లేకపోతే వెంటనే ఇలా చేయండి..!

లెవల్ 6 :
లెవల్ 6లో రూ.35,400 ఉన్న కనీస వేతనాన్ని రూ.65,844 లేదా రూ.1,01,244కి పెంచవచ్చు. ఇన్‌స్పెక్టర్, సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టులు ఈ కేటగిరీలోకి వస్తారు.

లెవల్ 7 :
సూపరింటెండెంట్లు, సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లను కలిగిన లెవల్ 7లో కనీస వేతనం రూ.44,900 నుంచి రూ.83,514 పెరిగి రూ.1,28,414కి పెరుగుతుందని అంచనా.

లెవల్ 8 :
లెవల్ 8లో రూ.47,600 ఉన్న కనీస వేతనం రూ.88,536 నుంచి రూ.1,36,136కి పెరిగే అవకాశం ఉంది. సీనియర్ సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్లు ఈ కేటగిరీలోకి వస్తారు.

లెవల్ 9 :
లెవల్ 9లో రూ.53,100 ఉన్న కనీస వేతనం రూ.1,51,866కి పెరుగుతుంది. అంటే రూ.98,766 పెరుగుదల ఉంటుందని అంచనా. ఈ లెవల్ పోస్టులో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఆడిట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి.

లెవల్ 10 :
లెవల్ 10లో గ్రూప్ A ఆఫీసర్ల వంటి సివిల్ సర్వీసెస్‌లోని ఎంట్రీ-లెవల్ అధికారులు ఉంటారు. కనీస వేతనం రూ.56,100 నుంచి రూ.1,04,346 పెరిగి రూ.1,60,446కి చేరుకునే అవకాశం ఉంది.

8వ వేతన సంఘంలో DA జీరో అవుతుందా? :
ప్రతి కొత్త వేతన సంఘంలో డియర్‌నెస్ అలవెన్స్ (DA) ప్రారంభంలోనే రీసెట్ అవుతుంది. ప్రస్తుతం, 7వ వేతన సంఘంలో డీఏ 53 శాతంగా ఉంది. అంటే.. మరో 3శాతం పెరిగే అవకాశం ఉంది. జూలైలో మరో సవరణ ఉంటుంది. కానీ, 8వ వేతన సంఘంలో ఇది సున్నా నుంచి రీసెట్ అవుతుంది. ఆపై మళ్లీ పెరగొచ్చు.