Site icon 10TV Telugu

EPFO : ఈపీఎఫ్ఓ అద్భుతమైన స్కీమ్.. ఉద్యోగి సర్వీసులోనే చనిపోతే.. రూ.7 లక్షల వరకు బీమా.. ఎవరు అర్హులు? ఎలా క్లెయిమ్స్ చేయాలంటే?

EPFO EDLI Scheme

EPFO EDLI Scheme

EPFO EDLI Scheme : ఈపీఎఫ్ఓ అద్భుతమైన స్కీమ్ తీసుకొచ్చింది. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాదారులకు ఆర్థికపరంగా అద్భుతమైన అవకాశం.. కష్ట సమయాల్లో (EPFO) మీ కుటుంబం ఆర్థికంగా ఎలాంటి లోటు లేకుండా ఉండొచ్చు.

అదే.. ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్.. ఈ (EDLI) పథకం కింద ఒక కంపెనీలో పనిచేసే ఉద్యోగి ఎవరైనా సర్వీసులో ఉండగానే మరణిస్తే.. వారి కుటుంబానికి ఆర్థిక భరోసాగా రూ.7 లక్షల వరకు ఇన్సూరెన్స్ అందిస్తోంది ఈపీఎఫ్ఓ. అసలు ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ అందరికి వర్తిస్తుందా? ఎవరు అర్హులు? ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అనే వివరాలను ఇప్పుడు చూద్దాం..

EDLI స్కీమ్ ఏంటి? :
ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే ఈపీఎఫ్ఓ సభ్యుల కోసం అందించే ఇన్సూరెన్స్ స్కీమ్ ఈడీఎల్ఐ. 1976లో ఈ పథకాన్ని ఈపీఎఫ్ఓ తీసుకొచ్చింది. సర్వీసులో ఉండగా ఉద్యోగి మరణిస్తే నామినీకి ఒకేసారి కొద్ది మొత్తంలో డబ్బు అందుతుంది. ఈపీఎఫ్ఓ, నిబంధనల చట్టం 1952 కింద అన్ని సంస్థలకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. తమ ఉద్యోగులకు తప్పనిసరిగా లైఫ్ ఇన్సూరెన్స్ అందించాల్సి ఉంటుంది.

ప్రీమియం చెల్లించాలా? వద్దా? :
ఈ స్కీమ్‌ కింద సభ్యులు ఎలాంటి ప్రీమియం చెల్లించనక్కర్లేదు. కంపెనీలు, యాజమాన్యాలే ఈ మొత్తాన్ని చెల్లిస్తాయి. బేసిక్ శాలరీలో 0.5 శాతం లేదా గరిష్ఠంగా రూ.75 వరకు ప్రతి నెలా కంపెనీలే కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. పీఎఫ్ ఖాతాదారుల వేతనం నుంచి కూడా వసూళ్లు చేయకూడదని ఓ నివేదిక తెలిపింది.

Read Also : Raksha Bandhan 2025 : రక్షాబంధన్ రోజున మీ సోదరి పేరుతో ఇలా పెట్టుబడి పెట్టండి.. ఇదే మీరు ఇచ్చే లైఫ్ లాంగ్ గిఫ్ట్..!

ఈ పథకం కింద కంట్రిబ్యూషన్లకు గరిష్ఠ వేతన పరిమితిని రూ.15 వేలు మాత్రమే. రూ.15 వేలకు పైగా బేసిక్ శాలరీ ఉన్నా రూ.15 వేలపైనే ఈడీఎల్ఐ చెల్లించాల్సి ఉంటుంది. కనీస వేతనం రూ.15 వేల కన్నా తక్కువ ఉంటే అదే లెక్కన చెల్లించాలి. ఒకవేళ ఈ మొత్తాన్ని కంపెనీలు చెల్లించకపోతే ఒక శాతంతో రికవరీ చేస్తుంది ఈవీఎఫ్ఓ సంస్థ.

ఎవరు క్లెయిమ్ చేయొచ్చంటే? :
సర్వీసులో ఉండగా ఉద్యోగి చనిపోతే.. స్కీమ్ కింద ఉద్యోగి నామినీగా ఉన్న వారు ఈ పథకం ప్రయోజనాల కోసం అప్లయ్ చేయొచ్చు. ఒకవేళ నామినీ పేరు నమోదు చేయకపోతే చట్టబద్ధమైన వారసులు లేదా కుటుంబ సభ్యులకు అందుతుంది. నామినీ, కుటుంబ సభ్యులు, వారసులు మైనర్లు అయితే ఈ మొత్తాన్ని గార్డియన్లు క్లెయిమ్‌ చేసుకోవచ్చు.

EDLI స్కీమ్ ప్రయోజనాలేంటి? :
గత 12 నెలల సగటు నెలవారీ జీతానికి 35 రెట్లకు పైగా ఈ బీమా మొత్తాన్ని పొందవచ్చు. అయితే, ఈపీఎఫ్ సభ్యునికి గరిష్ఠ సగటు నెలవారీ వేతనం రూ.15 వేలుగానే ఉండాలి. ఉద్యోగి 12 నెలలు లేదా ఆపై ఎక్కువ సర్వీసులో ఉన్నా 12 నెలల సగటు నెలవారీ వేతనం రూ.15000 x 35 చొప్పున రూ.5,25,000, అదనంగా రూ.1,75,000 బోనస్‌ను కలిపి గరిష్టంగా రూ. 7 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.

12 నెలలకుపైగా ఉద్యోగంలో కొనసాగితే ఆ వ్యక్తికి కనీసం రూ.2,50,000, గరిష్ఠంగా రూ.7 లక్షలు చెల్లించాలని ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. సర్వీసులో చేరి ఏడాది కాకముందే మరణిస్తే ఇన్సూరెన్స్ ప్రయోజనాలను సవరించింది. ఏడాదికి ముందే సర్వీసు పూర్తికాకుండా మరణిస్తే.. వారి కుటుంబ సభ్యులకు లేదా చట్టపరమైన వారసులకు కనీసం రూ.50 వేల ఇన్సూరెన్స్ ప్రయోజనాన్ని అందించనుంది.

EPFO క్లెయిమ్ ఎలా చేయాలి? :
చనిపోయిన ఉద్యోగి కుటుంబ సభ్యులు ELDI స్కీమ్ ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే కొన్ని డాక్యుమెంట్లను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.

ఆథరైజ్డ్ అధికారి లేనప్పుడు.. 

Exit mobile version