GST On Gold
GST On Gold : సామాన్యులపై నిత్యావసర వస్తువుల భారం తగ్గించేలా జీఎస్టీ స్వరూపంలో కేంద్రం కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం ఉన్న నాలుగు శ్లాబుల బదులు కేవలం 5శాతం, 18 శాతంతో రెండు శ్లాబుల విధానాన్ని కేంద్రం ప్రకటించింది. ఈ శ్లాబుల ప్రకారం.. కొన్ని వస్తువులు, వాహనాల ధరలు తగ్గనుండగా.. మరికొన్ని వస్తువులు, వాహనాల ధరలు పెరగనున్నాయి. సెప్టెంబర్ 22వ తేదీ నుంచే కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి రానున్నాయి.
జీఎస్టీ శ్లాబుల్లో మార్పుల వల్ల మధ్య తరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. మరోవైపు పొగాకు, పొగాకు ఉత్పత్తులు, గుట్కా వంటి హానికరమైన వస్తువులతోపాటు మరికొన్ని వస్తువులపై 40శాతం పన్నును కేంద్రం విధించనుంది. అయితే, జ్యూయలరీ, బంగారు నాణేలు, బంగారు కడ్డీలపై జీఎస్టీ రేటు 3శాతం వద్ద.. అలాగే తయారీ ఛార్జీలపై 5శాతం వద్ద ఉంది.
ప్రస్తుతం మీరు రూ. లక్ష విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తే బంగారం లేదా వెండిపై మూడు శాతం జీఎస్టీ, అదేవిధంగా తయారీ ఛార్జీలపై 5శాతం జీఎస్టీ ఉంటుంది. ఉదాహరణకు బంగారు ఆభరణాలపై తయారీ ఛార్జీలు రూ.5వేలు అయితే, ఈ మొత్తంపై 5శాతం జీఎస్టీ రూ.250 వసూలు చేయబడుతుంది. అంటే ఆభరణాల ధర మీకు రూ.1,08,250 అవుతుంది. (ఉదాహరణకు రూ.1,00,000 + రూ. 3,000 (3శాతం జీఎస్టీ) +రూ.5,000 (తయారీ ఛార్జీలు) + రూ.250 (తయారీ ఛార్జీలపై 5శాతం జీఎస్టీ). ఇది ప్రస్తుతం కొనసాగుతున్న విధానమే. అయితే, ప్రస్తుతం జీఎస్టీ సంస్కరణల్లో ఈ విధానంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.
గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. గోల్డ్ రేటు స్వల్పంగా తగ్గింది. మరోవైపు.. వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర స్వల్పంగా తగ్గింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.97,950 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,06,860కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,100 కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,07,010కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.97,950 కాగా.. 24క్యారెట్ల ధర రూ.1,06,860కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,37,000 వద్ద కొనసాగుతుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,27,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,37,000 వద్ద కొనసాగుతుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.