వాట్సాప్‌లో BUG : అప్పటివరకూ GIF ఫైల్స్ పంపొద్దు

ఫేస్ బుక్ సొంత యాప్ వాట్సాప్ ప్లాట్ ఫాంపై మాల్ వేర్ బగ్ ప్రవేశించింది. వాట్సాప్ అకౌంట్ ను వెంటనే అప్ డేట్ చేసుకోండి. లేదంటే.. మీ వాట్సాప్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ బగ్ కారణంగా భద్రతపరమైన సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
హ్యాకర్లు నుంచి వాట్సాప్ అకౌంట్లకు సెక్యూరిటీ పరంగా ముప్పు పొంచి ఉన్నట్టు సైబర్ సెల్ హెచ్చరిస్తోంది. ప్రతిరోజు బిలియన్ల మంది యూజర్లు తమ వాట్సాప్ అకౌంట్లలో ఫొటోలు, వీడియోలు, మెసేజ్ లు, జిఫ్ ఇమేజ్ ఫైల్స్ పంపిస్తుంటారు.
ఇందులో ఎక్కువ శాతం ఫేక్ న్యూస్ వైరల్ కంటెంట్ షేర్ అవుతుంది. తెలిసో తెలియకో ఫేక్ న్యూస్ ను స్ప్రెడ్ చేస్తుంటారు. వాట్సాప్‌లో బగ్ కారణంగా సస్పెక్ట్ కంటెంట్ వైరల్ చేస్తే మాల్ వేర్ చొరబడేందుకు అనుమతి ఇస్తోంది. దాంతో ఈజీగా మాల్ వేర్ మొబైల్ డివైజ్ లోకి ప్రవేశించి మీ విలువైన డేటాను హ్యాకర్లకు చేరవేస్తుంది. బగ్ ఇష్యూను ఫిక్స్ చేసేంత వరకు యూజర్లు ఎవరూ అనుమానాస్పద లింకులను షేర్ చేయొద్దు.
ప్రతిఒక్కరూ అప్ డేట్ చేసుకోనేంత వరకు ఎలాంటి GIF ఫైల్స్ వాట్సాప్ లో ఎవరికి పంపొద్దు. ఇలా చేస్తే.. జిఫ్ ఫైల్స్ ద్వారా హ్యాకర్లు మాల్ వేర్ జొప్పిస్తుంటారు. తద్వారా వైరస్ డివైజ్ ల్లోకి ప్రవేశించి విలువైన డేటాను తస్కరిస్తుంది. వాట్సాప్ వెర్షన్ 2.19.244 లో ఈ బగ్ ఉన్నట్టు గుర్తించారు. ఈ వెర్షన్ వాడే యూజర్లను వెంటనే కొత్త వెర్షన్ అప్ డేట్ చేసుకోవాలని సూచించింది.