మీరు ఆండ్రాయిడ్ వాట్సాప్ యూజర్లా? వాట్సాప్ నుంచి కొత్త అప్ డేట్ వచ్చేసింది. వాట్సాప్ బీటా వెర్షన్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. గూగుల్ ప్లే బీటా ప్రోగ్రామ్ ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ అప్ డేట్ రిలీజ్ అయింది. ప్లే స్టోర్ నుంచి వాట్సాప్ బీటా ఆండ్రాయిడ్ వెర్షన్ 2.19.331 డౌన్ లోడ్ చేసుకోండి.
ఆ తర్వాత ఒకసారి మీ వాట్సాప్ ఓపెన్ చేయండి. లేదా వాట్సాప్ బీటా వెర్షన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి.. ఏదైనా మార్పును గమనించారా? కిందిభాగంలో ఓ కొత్త ఫీచర్ యాడ్ అయింది చెక్ చేశారా? ఇది ఫేస్ బుక్ కొత్త బ్రాండింగ్. బీటా వెర్షన్ వాడని మిగతా యూజర్లకు డార్క్ మోడ్ ఫీచర్ ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇటీవలే ఫేస్ బుక్ తమ కంపెనీ బ్రాండింగ్ కోసం కొత్త కార్పొరేట్ బ్రాండింగ్ రిలీజ్ చేసింది.
తమ సొంత ఫ్యామిలీ యాప్స్ అయిన వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ప్లాట్ ఫాంలపై From Facebook అని కనిపిస్తోంది. వాట్సాప్ లోని బీటా వెర్షన్ లో కెమెరా ఐకాన్ అప్డేట్ చేసినప్పటి నుంచి ఈ బ్రాండింగ్ లోగో కనిపిస్తోంది. లేటెస్ట్ వాట్సాప్ బీటాపై ఈ అప్‌డేట్‌ను WABetaInfo షేర్ చేసింది. బీటా వెర్షన్ వాడని మిగతా వాట్సాప్ యూజర్లకు ఈ డార్క్ థీమ్ కనిపించే పరిస్థితి లేదు.
వాట్సాప్ యాప్‌పై డార్క్ మోడ్.. ఆండ్రాయిడ్ 10, 9 సిస్టమ్ లెవల్ సెట్టింగ్స్ ఎన్నో అంశాలు అందుబాటులోకి వచ్చేశాయి. స్ప్లాష్ స్క్రీన్, హోం స్క్రీన్ విడ్జెట్, చాట్ వాల్ పేపర్ అన్ని ఫీచర్లు అన్ని మార్చుకోవచ్చు. ఇందులో తొలి రెండు అప్ డేట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ, డార్క్ వాల్ పేపర్ కనిపిస్తోంది.
మిగిలిన యాప్ స్ర్కీన్లు (చాట్ లిస్టు, స్టేటస్, కాల్ లాగ్, సెట్టింగ్స్)మాత్రమే వైట్ మోడ్ లో ఉన్నాయి. డార్కర్ వెర్షన్ పై వర్క్ కొనసాగుతోంది. అన్ని మార్పులకు సంబంధించి అప్ డేట్స్.. లేటెస్ట్ వాట్సాప్ బీటా v2.19.331 (APK Mirror) నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. స్టేబుల్ వెర్షన్ 2.19.330 (APK Mirror)కూడా అందుబాటులో ఉంది.
కొత్త బ్రాండింగ్ ఇలా చెక్ చేయండి :
* మీ వాట్సాప్ అకౌంట్ ఓపెన్ చేయండి.
* కొంతమంది యూజర్లకు వాట్సాప్ ఓపెన్ చేయగానే కనిపిస్తోంది.
* స్ప్లాష్ స్ర్కీన్ కింది భాగంలో లేదా Settingsలో from FACEBOOK చూడొచ్చు.
* బీటా వెర్షన్ యూజర్లకు మాత్రమే DarkMode Themeతో కనిపిస్తోంది.
* మిగిలిన వాట్సాప్ యూజర్లకు వైట్ థీమ్‌పై కొత్త బ్రాండింగ్ చూడొచ్చు.
* Settingsలో Facebook బ్రాండింగ్ (ఎడమవైపు) చూడొచ్చు.
* డార్క్ Splash స్క్రీన్.. Middle ఫేస్‌బుక్ బ్రాండింగ్ కనిపిస్తుంది.
* కుడిభాగంలో Dark వాల్ పేపర్ కూడా చూడొచ్చు.