Lalit Khaitan
Forbes: ఆయన పేరు లలిత్ ఖైతాన్. వయసు 80 ఏళ్లు. ఈ వయసులో ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ‘త్రీ-కామా క్లబ్’లో లలిత్ ఖైతాన్ పేరును చేర్చింది ఫోర్బ్స్. ఈ ఏడాది ఆయన కంపెనీ షేర్లు 50 శాతం పెరగడంతో ఈ ఘనత సాధించారు.
‘రాడికో ఖైతాన్’ ఈయనదే..
ఆల్కహాల్ ఇండస్ట్రీ కంపెనీ ‘రాడికో ఖైతాన్’ లలిత్ ఖైతాన్‌దే. ఆయన తండ్రి నుంచి ఆ కంపెనీ లలిత్ ఖైతాన్‌కు వారసత్వంగా వచ్చింది. 1972లో రాంపూర్ డిస్టిలరీ అండ్ కెమికల్ కంపెనీ లిమిటెడ్‌ని లలిత్ ఖైతాన్ తండ్రి జీఎన్ ఖైతాన్ రూ.16 లక్షలకు కొనుగోలు చేశారు. విశేషం ఏమిటంటే ఎన్ ఖైతాన్‌కు మద్యం సేవించే అలవాటు లేదు.
సంప్రదాయ మార్వాడీ కుటుంబంలో జన్మించిన జీఎన్ ఖైతాన్ జీవితాంతం మద్యం తాగలేదు.. కానీ, మద్యం వ్యాపారాన్ని మాత్రం ప్రారంభించారు. 1995లో జీఎన్ ఖైతాన్ తన నలుగురు కుమారులకు వ్యాపారాలను, ఆస్తులను పంచారు. లతిత్ ఖైతాన్ తన తండ్రి నుంచి డిస్టిలరీ వ్యాపారాన్ని తీసుకున్నారు.
అప్పట్లో నష్టాల్లో నడిచిన ఈ సంస్థను లలిత్ ఖైతాన్ క్రమంగా లాభాల బాట పట్టించారు. రాడికో ఖైతాన్ చైర్మన్‌గా లలిత్ ఖైతాన్ బాధ్యతలు స్వీకరించాక ఆ సంస్థ దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీల్లో ఒకటిగా నిలిచింది.
85 దేశాల్లో విక్రయాలు
‘రాడికో ఖైతాన్’ బ్రాండ్లను దాదాపు 85 దేశాల్లో విక్రయిస్తున్నారు. మ్యాజిక్ మూమెంట్స్ వోడ్కా, 8 పీఎం విస్కీ, ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ, రాంపూర్ సింగిల్ మాల్ట్ వంటి ఆల్కహాలిక్ బ్రాండ్లు ఈ సంస్థవే. తాను తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలోనే మద్యం వ్యాపారంలో ఉండాలని ఆశించానని గతంలో లలిత్ ఖైతాన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తాను బాధ్యతలు స్వీకరించిన సమయంలో తమ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ.5 కోట్లుగా ఉండేదని, 22020 నాటికి అది రూ.5,000 కోట్లకు పైగా ఉందని అప్పట్లో లలిత్ ఖైతాన్ చెప్పారు.
ఈ ఏడాది ఆయన కంపెనీ షేర్లు 50 శాతం పెరిగాయి. ఆ సంస్థ విలువ బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో లలిత్ ఖైతాన్ బిలియనీర్ల జాబితాలో స్థానం సంపాదించుకున్నారు. లలిత్ ఖైతాన్ చదువు ప్రముఖ విద్యా సంస్థల్లో కొనసాగింది. అజ్మీర్‌లోని మాయో కాలేజ్, కోల్‌కతాలోని సెయింట్ జేవియర్స్ కాలేజ్ లో ఆయన చదివారు. ఆ తర్వాత బెంగళూరులోని బీఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి మేనేజిరియల్ ఫైనాన్స్, అకౌంటింగ్ కోర్సు చేశారు.
Samsung Galaxy Tab S8 : అత్యంత సరసమైన ధరకే శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S8 ఇదిగో.. కొత్త ధర ఎంతో తెలుసా?