ఆగస్టు 31 లాస్ట్ : Xiaomi Mi A3 స్పెషల్ సేల్.. క్యాష్ బ్యాక్ ఆఫర్లు

చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ షావోమీ సూపర్ సేల్ ప్రకటించింది. Mi A3 సిరీస్ కొత్త స్మార్ట్ ఫోన్ పై ఆగస్టు 31 వరకు ఓపెన్ సేల్ ఆఫర్ చేస్తోంది. తమ అధికారిక ట్విట్టర్ వేదికగా షావోమీ వెల్లడించింది.

  • Publish Date - August 27, 2019 / 12:59 PM IST

చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ షావోమీ సూపర్ సేల్ ప్రకటించింది. Mi A3 సిరీస్ కొత్త స్మార్ట్ ఫోన్ పై ఆగస్టు 31 వరకు ఓపెన్ సేల్ ఆఫర్ చేస్తోంది. తమ అధికారిక ట్విట్టర్ వేదికగా షావోమీ వెల్లడించింది.

చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ షావోమీ సూపర్ సేల్ ప్రకటించింది. Mi A3 సిరీస్ కొత్త స్మార్ట్ ఫోన్ పై ఆగస్టు 31 వరకు ఓపెన్ సేల్ ఆఫర్ చేస్తోంది. తమ అధికారిక ట్విట్టర్ వేదికగా షావోమీ వెల్లడించింది. ఇటీవలే షావోమీ నుంచి Mi A3 స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సూపర్ సేల్‌లో భాగంగా Mi A3 ఫోన్.. ఈ కామర్స్ వెబ్ సైట్ అమెజాన్, Mi.com సైట్లలో 24×7 అందుబాటులో ఉండనుంది.

ఈ ఆఫర్ ఆగస్టు 31 వరకు వ్యాలీడ్ ఉంటుంది. ‘#MiA3 స్పెషల్ సేల్.. ఆగస్టు 31 వరకు వ్యాలీడ్. #48MP AndroidOne ఫోన్ కొనాలంటే mi.com, @amazonIN ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డుల ద్వారా Mi A3 స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేవారికి @HDFC_Bank @airtelindia ద్వారా ప్రత్యేక ఆఫర్, డేటా ఆఫ‌ర్ కూడా పొందవచ్చు. 

షావోమీ నుంచి రిలీజ్ అయిన Mi A3 మూడో జనరేషన్ ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్ ఫోన్. దీని ప్రారంభ ధర రూ.12వేల 999గా ఉంది. ఈ కొత్త ఫోన్ లో అదిరిపోయే ట్రిపుల్ రియర్ కెమెరాతో పాటు 4030mAh బ్యాటరీ, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఈ కొత్త ఫోన్ కొనుగోలు చేసినవారికి కంపెనీ స్పెషల్ ఆఫర్లు అందిస్తోంది.

HDFC క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేసినవారికి రూ.750వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. EMI ద్వారా కొనుగోలు అయితే అదనంగా రూ.250వరకు పొందవచ్చు. ఎయిర్ టెల్ యూజర్లు.. రూ.249 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ యాక్టివేట్ చేసుకుంటే.. డబుల్ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ పొందవచ్చు. నాట్ జస్ట్ బ్లూ, మోర్ దెన్ వైట్, కైండ్ ఆఫ్ గ్రే మూడు కలర్లలో లభ్యం అవుతోంది. 

Xiaomi Mi A3 స్పెషిఫికేషన్లు ఇవే :
* 6.08 అంగుళాల HD+ స్ర్కీన్ (1560x720p) రెజుల్యూషన్, 19:5:9 యాస్పెక్ట్ రేషియో
* క్వాల్ కామ్న్ స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్
* ఆండ్రాయిడ్ 9.0పై ఆపరేటింగ్ సిస్టమ్
* 32MP కెమెరా, ఫ్రంట్ సెల్ఫీలు 
* ట్రిపుల్ కెమెరా సెటప్
* 48MP ప్రైమరీ లెన్స్, అప్రెచర్ f/1.79
* 8MP వైడ్ యాంగిల్ లెన్స్, 118 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ
* 2MP డెప్త్ సెన్సార్
* 4030mAh బ్యాటరీ
* నాట్ జస్ట్ బ్లూ, మోర్ దెన్ వైట్, కైండ్ ఆఫ్ గ్రే