Yamaha R15 Price Cut : యమహా లవర్స్‌కు స్పెషల్ ఆఫర్.. ఈ 3 బైకులపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు.. ఏది కొంటారో కొనేసుకోండి!

Yamaha R15 Price Cut : యమహా బైకుపై అద్భుతమైన డిస్కౌంట్. యమహా మోటార్ పాపులర్ R15 సిరీస్ బైక్‌లపై రూ. 5వేలు సేవ్ చేసుకోవచ్చు. ఈ స్పెషల్ డిస్కౌంట్ ఎలా పొందాలంటే?

Yamaha R15 Price Cut : యమహా లవర్స్‌కు స్పెషల్ ఆఫర్.. ఈ 3 బైకులపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు.. ఏది కొంటారో కొనేసుకోండి!

Yamaha R15 Price Cut (Image Credit To Original Source)

Updated On : January 7, 2026 / 8:46 PM IST

Yamaha R15 Price Cut : కొత్త బైక్ కొనేందుకు చూస్తున్నారా? మీరు యమహా బైక్ లవర్స్ అయితే ఇది మీకోసమే. యమహా మోటార్ 70వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా యమహా మోటార్ ఇండియా పాపులర్ R15 సిరీస్ బైకు 3 మోడళ్లపై రూ.5వేలు స్పెషల్ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ అద్భుతమైన ఆఫర్ జనవరి 5 నుంచి అమల్లోకి వచ్చింది.

ఈ ప్రత్యేక ఆఫర్ తర్వాత యమహా R15 సిరీస్ బైక్‌ల ప్రారంభ ధర ఇప్పుడు ఢిల్లీలో రూ.1,50,700 ఎక్స్-షోరూమ్‌గా మారింది. వేల రూపాయల ఆదా చేసుకోవచ్చు. మీుక ఇష్టమైన స్పోర్ట్స్ బైక్‌ కొనుగోలు చేయాలనుకుంటే ఈ అద్భుతమైన డిస్కౌంట్ అసలు మిస్ చేసుకోవద్దు..

యమహా బైక్‌పై ప్రత్యేక ఆఫర్, ధర ఎంత? :
యమహా వార్షికోత్సవ ఆఫర్ కింద R15 సిరీస్ బైక్‌ల కొత్త ధరలపై అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది. మీరు యమహా R15 S మోడల్‌ తీసుకుంటే రూ.1,50,700 ఎక్స్-షోరూమ్ ధరకు కొనుగోలు చేయవచ్చు. యమహా R15 V4 ధర రూ. 1,66,200, యమహా R15 M ధర రూ. 1,81,100, ఎక్స్-షోరూమ్ కొనుగోలు చేయొచ్చు.

Read Also : Post Office Scheme : పోస్టాఫీసులో సూపర్ స్కీమ్.. జస్ట్ రోజుకు రూ. 500 ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఎన్ని ఏళ్లలో రూ. 25 లక్షలు సంపాదిస్తారంటే?

మిలియన్‌కు పైగా యూనిట్లు ఉత్పత్తి :
భారతీయ మార్కెట్లో ఎంట్రీ-లెవల్ పెర్ఫార్మెన్స్ బైకుల విభాగంలో యమహా R15 విప్లవాత్మక మార్పులు తెచ్చింది. లాంచ్ దగ్గర నుంచి అద్భుతమైన డిజైన్, లేటెస్ట్ టెక్నాలజీతో అద్భుతమైన రైడింగ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. దాంతో యువత మెచ్చిన బైకుగా అవతరించింది. భారత మార్కెట్లో ఇప్పటివరకు ఒక మిలియన్ యూనిట్లకు పైగా R15 ఉత్పత్తి అయ్యాయి.

Yamaha R15 Price Cut

Yamaha R15 Price Cut (Image Credit To Original Source)

యమహా R15 ఫీచర్లు :
యమహా R15 స్పోర్ట్స్ బైక్ ఫీచర్ల విషయానికి వస్తే.. 155cc లిక్విడ్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజిన్‌తో వస్తుంది. 18.4 పీఎస్ పవర్ 14.2Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ యమహా స్పెషల్ DiCyl సిలిండర్ టెక్నాలజీ పాపులర్ డెల్టాబాక్స్ ఫ్రేమ్‌తో వస్తుంది. మైలేజ్ 45kmpl వరకు అందిస్తుంది. ఇందులో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, అసిస్ట్ స్లిప్పర్ క్లచ్ క్విక్ షిఫ్టర్ వంటి అనేక అడ్వాన్స్ ఫీచర్లు ఉన్నాయి. అలాగే అప్‌సైడ్-డౌన్ ఫ్రంట్ ఫోర్కులు, లింక్డ్-టైప్ మోనోక్రాస్ సస్పెన్షన్‌ ఉన్నాయి.