YouTube Earn Money : యూట్యూబర్లకు గుడ్ న్యూస్.. ఇక మీ ఛానల్‌కు 500 సబ్‌స్ర్కైబర్లు ఉన్నా చాలు.. ఎవరైనా ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు..!

YouTube Earn Money : యూట్యూబర్ క్రియేటర్లకు అదిరే న్యూస్.. (YouTube) ఇప్పుడు 500 మంది సబ్‌స్క్రైబర్‌లను ఉంటే చాలు.. ఎవరైనా డబ్బు సంపాదించేందుకు అనుమతిస్తుంది.

YouTube Earn Money : యూట్యూబర్లకు గుడ్ న్యూస్.. ఇక మీ ఛానల్‌కు 500 సబ్‌స్ర్కైబర్లు ఉన్నా చాలు.. ఎవరైనా ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు..!

YouTube will now allow anyone with 500 subscribers to earn money

Updated On : June 14, 2023 / 8:27 PM IST

YouTube Earn Money : యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు శుభవార్త.. మీ యూట్యూబ్ ఛానల్‌కు మానిటైజేషన్ లేదా? అయితే, ఇకపై ఛానల్ మానిటైజేషన్ పొందాలంటే 1000 మంది సబ్‌స్ర్కైబర్లు అవసరం లేదు. కేవలం 500 మంది సబ్‌స్ర్కైబర్లు తెచ్చుకుంటే చాలు.. యూట్యూబ్ మీకు మానిటైజేషన్ ఎనేబట్ చేస్తుంది. మీ కంటెంట్‌పై యాడ్స్ ద్వారా ఈజీగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇప్పటికే యూట్యూబ్ షార్ట్ వీడియో (Youtube Shorts) క్రియేటర్లు కూడా యూట్యూబ్‌లో తమ కంటెంట్ ద్వారా మానిటైజేషన్ పొందుతున్నారు. కంటెంట్‌ను మానిటైజ్ కోసం మరిన్ని అవకాశాలను ఉన్నప్పటికీ చాలామంది షార్ట్ వీడియో క్రియేటర్లు ఇప్పటికీ తమ సబ్‌స్ర్కైబర్లను పెంచుకునేందుకు తెగ ఇబ్బంది పడిపోతున్నారు. మానిటైజేషన్ ఎనేబుల్ కావాలంటే.. యాడ్స్ ఇవ్వాలన్నా నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి.

మీరు (YouTube)లో 1000 సబ్‌స్క్రైబర్‌లను తెచ్చుకోవడంలో ఇబ్బంది పడుతున్నారా? ఇప్పుడు గూగుల్ యాజమాన్యంలోని వీడియో కంపెనీ యూట్యూబ్ కనీస సబ్‌స్క్రైబర్‌ల సంఖ్యను 1000 నుంచి 500కి తగ్గించింది. ఈ ప్లాట్‌ఫారమ్‌లో షార్ట్ క్రియేటర్లకు మరిన్ని అవకాశాలను అందించడానికి యూట్యూబ్ మానిటైజేషన్ విధానాలకు భారీ మార్పులు చేస్తోంది. యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్‌కు అర్హత అవసరాలను తగ్గిస్తోంది. తద్వారా తక్కువ ఫాలోయింగ్ ఉన్న క్రియేటర్‌లకు అందుబాటులో ఉన్న మానిటైజేషన్ విధానాల్లో పరిధిని విస్తరింపజేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

Read Also : Best Premium Flagship Phones : ఈ నెలలో కొనాల్సిన బెస్ట్ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ 5G స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!

కొత్త మానిటైజేషన్ రూల్స్ ఇవే :
గతంలో యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్‌లో చేరడానికి, తమ కంటెంట్‌ను మానిటైజ్ చేయడానికి క్రియేటర్లు నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. యూట్యూబ్‌లో మానిటైజేషన్‌కు కనీసం (1000) మంది సబ్‌స్క్రైబర్లు తప్పక ఉండాలి. అంతేకాదు.. ఏడాదిలో కనీసం 4000 వాచింగ్ అవర్స్ లేదంటే.. చివరి 90 రోజుల్లో 10 మిలియన్‌ షార్ట్స్‌ వ్యూస్‌ (Short Views) వచ్చి ఉండాలి. కొత్త మానిటైజేషన్‌ నిబంధనల ప్రకారం.. ఇక నుంచి యూట్యూబ్‌లో 500 మంది సబ్‌స్క్రైబర్లు ఉండాలి. చివరి 90 రోజుల్లో కనీసం 3 లేదా అంతకంటే ఎక్కువ పబ్లిక్‌ వీడియోలను క్రియేట్ చేసి ఉండాలి.

ఏడాదిలో 3వేల గంటల వ్యూస్ లేదంటే చివరి 90 రోజుల్లో 3 మిలియన్‌ షార్ట్స్‌ వ్యూస్‌ తప్పనిసరిగా వచ్చి ఉండాలి. అప్పుడు మాత్రమే మానిటైజేషన్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. యూట్యూబ్ వీడియో మానిటైజేషన్ బెంచ్‌మార్క్ ప్రకారం.. (4000) వాచింగ్ అవర్స్ నుంచి (3000) వాచింగ్ అవర్స్‌కు తగ్గించింది. యూట్యూబ్ (Shorts Views) మానిటైజేషన్ పొందాలంటే.. 10 మిలియన్ల నుంచి 3 మిలియన్లకు తగ్గించింది. యూట్యూబ్ ఈ కొత్త అప్‌డేట్ యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా, తైవాన్, దక్షిణ కొరియాలో మాత్రమే అమల్లో ఉంటుంది. భారత్‌లో కూడా కొత్త మానిటైజేషన్ రూల్స్ అందుబాటులోకి వస్తాయా లేదా అనేది యూట్యూబ్ క్లారిటీ ఇవ్వలేదు.

షార్ట్ క్రియేటర్ల కోసం యాడ్ రెవిన్యూ షేరింగ్ ప్రొగ్రామ్ :
షార్ట్ క్రియేటర్‌లు ఇప్పుడు యూట్యూబ్‌లో తమ కంటెంట్‌ను మానిటైజ్ చేసేందుకు మరిన్ని అవకాశాలను అందిస్తోంది. ఇప్పటికీ తమ సబ్‌స్ర్కైబర్లు పెంచుకోక తప్పదు. యాడ్స్ ద్వారా డబ్బులు సంపాదించాలంటే నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ఆదాయ భాగస్వామ్యానికి ఇప్పటికే ఉన్న నిబంధనల్లో ఎలాంటి మార్పులు ఉండవు. అయితే, యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్‌కు ఇప్పటికే అర్హత సాధించిన క్రియేటర్లు అధిక పరిమితులను (higher thresholds) సాధించిన తర్వాత మళ్లీ అప్లయ్ చేయాల్సిన అవసరం లేదని గమనించాలి. యూట్యూబ్ తన యాడ్స్ ద్వారా పార్టనర్ ప్రోగ్రామ్ ద్వారా ఆదాయాన్ని సంపాదించడానికి క్రియేటర్లను అనుమతిస్తుంది. ప్రత్యేకించి ఈ ప్లాట్‌ఫారమ్ షార్ట్-ఫారమ్ కంటెంట్ (Shorts) కోసం యాడ్ రెవిన్యూ షేరింగ్ ప్రోగ్రామ్‌ (ad revenue sharing program)ను ప్రవేశపెట్టింది. క్రియేటర్లు తమ కంటెంట్‌ను మానిటైజ్ చేసుకునేలా యూట్యూబ్ వారిని ప్రోత్సహించడంతో పాటు షార్ట్-ఫారమ్ కంటెంట్ ఆఫర్‌లను మరింత మెరుగుపర్చడమే లక్ష్యంగా పెట్టుకుంది.

YouTube will now allow anyone with 500 subscribers to earn money

YouTube will now allow anyone with 500 subscribers to earn money

యూట్యూబ్ మాదిరిగానే (TikTok) వంటి ఇతర ప్లాట్‌ఫారమ్‌లు కూడా క్రియేటర్ మానిటైజేషన్‌కు సపోర్టు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేశాయి. 10వేల మంది ఫాలోవర్లు ఉన్న క్రియేటర్‌లకు సిరీస్ అని పిలిచేవీడియో పేవాల్ ఫీచర్ (video paywall feature) అందుబాటులో ఉంటుందని టిక్‌టిక్ ఇటీవల ప్రకటించింది. అయితే, అదనపు అవసరాలను తీర్చగల 1,000 మంది ఫాలోవర్లు ఉన్నవారు కూడా అప్లయ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ క్రియేటర్‌లకు ప్రీమియం కంటెంట్‌ని అందించడానికి వీలు కల్పిస్తుంది. అంతేకాకుండా, యూట్యూబ్ తన షాపింగ్ అనుబంధ ప్రోగ్రామ్‌ను కూడా విస్తరిస్తోంది.

ఇన్విటేషన్ ద్వారా ఆప్షన్ ఉన్న క్రియేటర్లకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు, అమెరికాలో కనీసం 20వేల మంది సబ్‌స్క్రైబర్‌లతో (YPP) పాల్గొనేవారు కూడా ఈ ప్రోగ్రామ్‌ను యాక్సెస్ చేయొచ్చు. ఈ విధానం అనుబంధ మార్కెటింగ్, ప్రొడక్టు ప్రమోషన్ ద్వారా డబ్బులు సంపాదించేందుకు వీలు కల్పిస్తుంది. యూట్యూబ్, ఇతర ప్లాట్‌ఫారమ్‌ల నుంచి వచ్చిన ఈ అప్‌డేట్‌లు షార్ట్ క్రియేటర్‌లకు సపోర్టు ఇవ్వడంతో పాటు డబ్బు సంపాదించడం ద్వారా ఆదాయాన్ని సంపాదించడం, క్రియేటివిటీని మెరుగుపర్చుకోవడం వంటి వాటిపై ఎక్కువ దృష్టి పెట్టేలా ప్రొత్సహిస్తోంది.

Read Also : OnePlus Nord 3 Price Leak : వన్‌ప్లస్ నార్డ్ 3 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫీచర్లు, ధర లీక్..!