OnePlus Nord 3 Price Leak : వన్‌ప్లస్ నార్డ్ 3 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫీచర్లు, ధర లీక్..!
OnePlus Nord 3 Price Leak : ఈ జూన్‌లోనే వన్‌ప్లస్ నార్డ్ 3 ఫోన్ లాంచ్ కానుంది. OnePlus Nord 2, Nord 2T ఫోన్ మాదిరిగానే భారత మార్కెట్లోకి రానుంది. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీకయ్యాయి.

OnePlus Nord 3 storage options and prices leaked ahead of expected launch this month
OnePlus Nord 3 Price : భారత మార్కెట్లో వన్‌ప్లస్ నార్డ్ (OnePlus Nord) లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్ అయ్యాయి. ఈ లీక్‌లలో మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న టిప్‌స్టర్ రోలాండ్ క్వాండ్ట్ ప్రకారం.. నార్డ్ 3 రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో రానుంది. బేస్ మోడల్ 8GB RAM, 128GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌తో అందుబాటులో ఉంటుంది. టాప్ మోడల్‌లో 16GB RAM, 256GB స్టోరేజ్ ఉండవచ్చు. 16GB వరకు RAMని కలిగిన ఫస్ట్ నార్డ్ ఫోన్ ఇదే కానుంది.
బేస్ మోడల్ ధర EUR 449 (రూ. 37,800) ఉండనుంది. టాప్ మోడల్ ధర EUR 549 (రూ. 48,700) ఉండనుంది. వన్‌ప్లస్ నార్డ్ 3 భారత నిర్దిష్ట ధరలను టిప్‌స్టర్ షేర్ చేయలేదు. అయినప్పటికీ ఈ ఫోన్ ధర భారతీయ మార్కెట్‌కు సరసమైనదిగా ఉంటుందని భావించవచ్చు. గత ఏడాదిలో (Nord 2T) రూ. 28,999 (128GB), రూ. 33,999 (256GB)కి విక్రయిస్తోంది. నార్డ్ 3 వెర్షన్ల కన్నా అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంటుందని భావిస్తోంది. భారత్ మార్కెట్లో ధర రూ. 31వేల నుంచి ప్రారంభమైన టాప్ మోడల్ ధర రూ. 38వేల వరకు ఉండవచ్చు.
వన్‌ప్లస్ (OnePlus 11R)తో సహా (128GB) ధర రూ. 39,999, (256GB) రూ. 44,999 వద్ద రిటైల్ అవుతుంది. నార్డ్ 3 అధికారిక రెండర్లు లీక్ అయిన కొన్ని రోజుల తర్వాత ఈ లీక్ వెలుగులోకి వచ్చింది. ఈ ఫోన్‌లో బ్లాక్, లైమ్ గ్రీన్ అనే 2 కలర్ ఆప్షన్‌లు ఉండవచ్చు. నోర్డ్ 3 యూనిబాడీతో బ్యాక్ సైడ్ కొత్త డిజైన్‌ను కలిగి ఉంటుంది. లౌడ్, సైలెంట్ ఆడియో మోడ్‌లను నిర్వహించేందుకు ప్రత్యేకమైన వార్నింగ్ స్లయిడ్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

OnePlus Nord 3 Price Leak : OnePlus Nord 3 storage options and prices leaked ahead of expected launch this month
బ్యాక్ సైడ్ రెండు కటౌట్‌లు, ఈ ఫోన్ 3 కెమెరాలను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. బ్యాక్ కెమెరా సిస్టమ్ 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరాను కలిగి ఉంటుందని చెప్పవచ్చు. ఫ్రంట్ సైడ్ 2772×1240 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
ఈ ఫోన్ MediaTek Dimensity 9000 అక్టో కోర్ SoC, 5000mAh బ్యాటరీ నుంచి పవర్ అందిస్తుంది. బ్యాటరీ 80W ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉండవచ్చు. ఈ డివైజ్ గంటలోపు 0 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ చేయగలదు. ఇతర రూమర్ స్పెసిఫికేషన్‌లలో ఆండ్రాయిడ్ 13, 5G, అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా Nord 3 లాంచ్‌ను (OnePlus) ఇంకా ధృవీకరించలేదని గమనించాలి.