Zomato ‘District’ App : జొమాటో కొత్త యాప్ ‘డిస్ట్రిక్’ ఇదిగో.. డైనింగ్, లైవ్ ఈవెంట్స్ సర్వీసులు!

Zomato ‘District’ App : ఈ యాప్ డైనింగ్ సర్వీసులతో పాటు సినిమాలు, డైరెక్ట్ షోలు, క్రీడా ఈవెంట్‌ల కోసం టిక్కెట్ బుకింగ్‌లను కూడా చేసుకోవచ్చు.

Zomato ‘District’ App : జొమాటో కొత్త యాప్ ‘డిస్ట్రిక్’ ఇదిగో.. డైనింగ్, లైవ్ ఈవెంట్స్ సర్వీసులు!

Zomato launches District app for dining and live events experiences

Updated On : November 17, 2024 / 8:24 PM IST

Zomato ‘District’ App : ప్రముఖ పాపులర్ ఫుడ్ డెలివరీ యాప్ కంపెనీ జొమాటో కొత్త సర్వీసులను ప్రారంభించింది. జొమాటో లేటెస్ట్ వెంచర్, ‘డిస్ట్రిక్ట్’ యాప్‌ను అధికారికంగా ఆవిష్కరించింది. వినియోగదారులకు మరిన్ని సేవలను అందించే లక్ష్యంతో అనేక కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఓఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్‌లు రెండింటిలోనూ ఈ డిస్ట్రిక్ట్ యాప్ అందుబాటులో ఉంది. ఈ యాప్ డైనింగ్ సర్వీసులతో పాటు సినిమాలు, డైరెక్ట్ షోలు, క్రీడా ఈవెంట్‌ల కోసం టిక్కెట్ బుకింగ్‌లను కూడా చేసుకోవచ్చు.

ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్, బ్లింకిట్-కామర్స్ సర్వీసు తర్వాత జొమాటో మూడో ప్రధాన యూజర్ సర్వీసుగా నిలుస్తుంది. నగరాల్లో బయటికి వెళ్లాలనుకునే వారికి కంపెనీ వన్-స్టాప్ గమ్యస్థానంగా నిలుస్తోంది. గత ఆగస్ట్‌లో రూ. 2,048.4 కోట్లకు (244 మిలియన్ డాలర్లు) పేటీఎం ఎంటర్‌టైన్మెంట్, టికెటింగ్ బిజినెస్‌ను జొమాటో కొనుగోలు చేసిన నేపథ్యంలో ఈ ఆవిష్కరణ జరిగింది. వినోదం డైనింగ్ రంగాలలో ఉనికిని పెంచుకునేందుకు జొమాటో అడుగులు వేస్తోంది.

కొత్త యాప్ సామర్థ్యాన్ని సీఈఓ గోయెల్ మాట్లాడుతూ.. “బయటికి వెళ్లడానికి ఒక-స్టాప్ డెస్టినేషన్ యాప్‌ని రూపొందించడం ప్రతిదానికీ గేమ్-ఛేంజర్ కావచ్చు. మా కొత్త డిస్ట్రిక్ట్ (జొమాటో) యాప్‌తో సరిగ్గా అమలు చేయాలని భావిస్తున్నాం. జొమాటో నుంచి మూడో అతిపెద్ద బీ2సి బిజినెస్ పెంచుకోవచ్చు.

జొమాటో డిస్ట్రిక్ట్ యాప్ డైనింగ్-అవుట్ సేవలను ఏకీకృతం చేస్తుంది. మూవీ టికెటింగ్, లైవ్ ఈవెంట్ బుకింగ్‌లు, స్పోర్ట్స్ టికెటింగ్ వంటి అదనపు ఆఫర్‌లతో రిలయన్స్ మద్దతుతో బుక్‌మైషో వంటి ప్లాట్‌ఫారమ్‌లకు పోటీగా ఈ యాప్ తీసుకొచ్చినట్టు’’ పేర్కొన్నారు. జొమాటో మెయిన్ యాప్‌లోని ఫీచర్లను డిస్ట్రిక్ట్ యాప్‌కు కూడా మారుస్తామని, 2025 ఆగష్టు చివరి వరకు మాత్రమే పేటీఎం యాప్‌లో టికెటింగ్ సర్వీసులు కొనసాగుతాయని జొమాటో పేర్కొంది.

Read Also : Kailash Gahlot : ఆప్‌కు ఎదురుదెబ్బ.. ఢిల్లీ మంత్రి కైలాష్ గహ్లాట్ రాజీనామా.. లేఖలో పార్టీపై ఆరోపణలు!