రెండో పెళ్లి వద్దన్నాడని కొడుకుని…

Crime News: అహమ్మాదాబాద్ లో నివసించే ఓ 50 ఏళ్ల తండ్రి రెండో పెళ్లి చేసుకోవాలను కున్నాడు. అందుకు కొడుకు అభ్యంతరం చెప్పాడు. దీంతో ఆ తండ్రి కొడుకును కొరికి గాయపరిచాడు.
దరియాపూర్ ఏరియాలో నివసించే నయీముద్దీన్ షేక్ (50) గత మూడు సంవత్సరాలుగా కుటుంబాన్ని పట్టించుకోకుండా ఇంటి పైన అంతస్తులో నివసిస్తున్నాడు. కింది భాగంలో అతని భార్య, కుమారుడు నివసిస్తున్నారు.
కుమారుడు యహ్యషేక్ మెడికల్ రిప్రజెంటేటివ్ గా పని చేస్తున్నాడు. నయీముద్దీన్ తను రెండో వివాహాం చేసుకుంటున్నట్లు ఇంట్లో చెప్పాడు. వెంటనే కొడుకు అభ్యంతరం చెప్పాడు. దీంతో నయీముద్దీన్ కొడుకుమీద పడి భుజం, ముఖం, చెంపలు, వీపుపై నోటితో కొరికి గాయపరిచాడు.
కొడుకుపై పడి రక్కుతున్నాడని అతని మొదటి భార్య జుబెదాబెన్ అడ్డురాగా ఆమెను మొహం పై కొట్టి తోసేసాడు. గాయలపాలైన యహ్యాషేక్ తండ్రిపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.