Inspired By Television Show: ఒక మహిళను హతమార్చి తాను చనిపోయినట్లు నాటకమాడిన మరో మహిళ
ఆమె బాయ్‌ఫ్రెండ్ పేరు అజయ్ ఠాకూర్. మృతురాలు, పాయల్ స్నేహితులే. ఇదే ఆమెకు అదనుగా మారింది. బాధితురాలికి మాయమాటలు చెప్పి బయటకు తీసుకెళ్లి యాసిడ్ దాడి చేశారు, గొంతు కోసం హతమార్చింది. అనంతరం ముఖం గుర్తు పట్టకుండా ధ్వంసం చేశారు. ఆమె అచ్చం తనలాగే ఉందని, అందుకే చంపానని పోలీసుల విచారణలో పాయల్ చెప్పడం గమనార్హం

Noida Woman Fakes Death By Murdering Another
Inspired By Television Show: ఒక మహిళను హతమార్చి తాను చనిపోయినట్టు నటించి పెద్ద నాటకమే ఆడింది మరో మహిళ. ఏదో టెలివిజ్ షోలో వచ్చే ప్రోగ్రాం చూసి స్ఫూర్తి పొందిందట. పథకం ప్రకారం.. బాధితురాలిని బయటికి రప్పించి ప్రియుడి సాయంతో హతమార్చింది. కాగా, ఇద్దరు నేరస్తులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నేరస్తురాలిది గ్రేటర్ నోయిడాకు 15 కిలోమీటర్ల దూరంలోని భద్పుర అనే ఒక గ్రామం.
నేరస్తురాలి పేరు పాయల్. ఆమె బాయ్‌ఫ్రెండ్ పేరు అజయ్ ఠాకూర్. మృతురాలు, పాయల్ స్నేహితులే. ఇదే ఆమెకు అదనుగా మారింది. బాధితురాలికి మాయమాటలు చెప్పి బయటకు తీసుకెళ్లి యాసిడ్ దాడి చేశారు, గొంతు కోసం హతమార్చింది. అనంతరం ముఖం గుర్తు పట్టకుండా ధ్వంసం చేశారు. ఆమె అచ్చం తనలాగే ఉందని, అందుకే చంపానని పోలీసుల విచారణలో పాయల్ చెప్పడం గమనార్హం. ఇక ఇక్కడి నుంచి అసలు కథ ప్రారంభమైంది. తాను ఆత్మహత్య చేసుకున్నట్లు లెటర్ రాసి కుటుంబానికి పంపింది. వాళ్లు నిజమే అనుకుని ఆ మృతదేహాన్ని తీసుకెళ్లి తగలబెట్టారు.
అయితే బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటికి వచ్చింది. విచారణ ప్రారంభించిన పోలీసులు అనుమానంతో పాయల్, అజయ్‌లను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితురాలు నేరాన్ని అంగీకరించారు.