Jawan Fires: సహచరులపై జవాన్ కాల్పులు.. ఒకరి మృతి

సహచరులపై సీఐఎస్ఎఫ్ జవాన్ జరిపిన కాల్పుల్లో ఒక జవాను మరణించారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. కోల్‌కతాలోని ఇండియన్ మ్యూజియమ్ వద్ద శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Jawan Fires: సహచరులపై సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) జవాన్ జరిపిన కాల్పుల్లో ఒక జవాను మరణించారు. మరికొంతమంది గాయపడ్డట్లు సమాచారం. ఈ ఘటన శనివారం సాయంత్రం కోల్‌కతాలోని ఇండియన్ మ్యూజియమ్ వద్ద జరిగింది.

Niti Aayog: కేసీఆర్ వ్యాఖ్యలు సరికాదు.. తెలంగాణ సీఎం ఆరోపణలపై స్పందించిన నీతి ఆయోగ్

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం 6:45 గంటలకు ఒక సీఐఎస్ఎఫ్ జవాన్ తన సహచరులైన అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్‌తోపాటు, మరో హెడ్ కానిస్టేబుల్‌పై కాల్పులు జరిపాడు. తన దగ్గరున్న సర్వీస్ రివాల్వర్‌తో కాల్పులు ప్రారంభించాడు. ఈ ఘటనలో రంజిత్ కుమార్ అనే ఏఎస్ఐ అక్కడికక్కడే మరణించాడు. మరో జవాను తీవ్రంగా గాయపడ్డాడు. అయితే, ఘటన సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకోగా, వారిపై కూడా కాల్పులు జరిపాడు. అక్కడికి చేరుకున్న పోలీస్ వాహనంపై కూడా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో పలువురు పోలీసులకు గాయాలైనట్లు సమాచారం. పోలీసులు నిందితుడిని లొంగిపోమని హెచ్చరించినప్పటికీ వినలేదు. అయితే, చాలాసేపు శ్రమించి నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Jagdeep Dhankhar: నూతన ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్‌కర్

మ్యూజియమ్ పరిసర ప్రాంతాలను కూడా పోలీసులు ఆధీనంలోకి తెచ్చుకున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తిని హెడ్ కానిస్టేబుల్ అక్షయ్ మిశ్రాగా గుర్తించారు. అంతకుముందు అతడు లోడెడ్ ఏకే 47 గన్‌తో కూడా కనిపించినట్లు స్థానికులు చెప్పారు. అతడ్ని అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు ప్రశ్నించగా, పొరపాటున కాల్చానని చెప్పాడు. పోలీసు వాహనంలోంచి బుల్లెట్లు దూసుకెళ్లిన గుర్తులున్నాయి. కారు సీటుపై రక్తపు మరకలు కూడా ఉన్నాయి. పోలీసులు ప్రస్తుతం నిందితుడిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు