శ్రీనగర్ లో ఉగ్రదాడి…15మందికి గాయాలు

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రెండు వారాల్లో మూడోసారి కశ్మీర్ లో ఉగ్రదాడి జరిగింది. రోడ్డుపక్కన కూరగాయలు అమ్ముకునేవాళ్లను ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. ఆంక్షల కారణంగా సిటీలో మార్కెట్ లు మూతబడి ఉన్న కారణంగా శ్రీనగర్ నడిబొడ్డున ఉన్న కూరగాయల మార్కెట్ దగ్గర రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునేవారు టార్గెట్ గా ఇవాళ(నవంబర్-4,2019)మధ్యాహ్నాం జరిగిన గ్రెనేడ్ దాడిలో ఒకరు చనిపోగా, 15మంది గాయపడ్డారు. గాయపడినవారిని పోలీసులు హాస్పిటల్ కు తరలించారు. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గత వారం కూడా నార్త్ కశ్మీర్ లోని సోపోర్ లో ఇలాగే జరిగిన గ్రనేడ్ దాడిలో 15మంది ప్రజలు గాయపడిన విషయం తెలిసిందే.

ఆగస్టు-5,2019న జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అప్పటినుంచి కశ్మీర్ లో భద్రతను మరింత పెంచారు. భద్రతా సిబ్బంది హై అలర్ట్ లో ఉన్నారు. అయినప్పటికీ ఉగ్రదాడులు జరుగుతూనే ఉండటం ఆందోళన కలిగిస్తుంది. ట్రక్కు డ్రైవర్లను కూడా టెర్రరిస్టులు టార్గెట్ చేసి చంపేస్తున్నారు. అక్టోబర్ లో కశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడుల్లో 11మంది స్థానికేతరులు ప్రాణాలు కోల్పోయారు. 

అక్టోబర్-31,2019నుంచి జమ్మూకశ్మీర్,లఢఖ్ లు కేంద్రపాలిత ప్రాంతాలుగా అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్ అసెంబ్లీతో కూడాన కేంద్రపాలితప్రాంతంగా,లఢఖ్ అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా అమల్లోకి వచ్చాయి.