Boyfriend Attack : కూతురుతో మాట్లాడవద్దు అన్నందుకు గర్ల్ ప్రెండ్ తండ్రిపై దాడి

తన కూతురు వెంట పడద్దని హెచ్చరించినందుకు ఒక యువకుడు  ఆమె తండ్రిని  కత్తితొ పొడిచి గాయపరిచాడు.

Boy Friend Attack

Boyfriend Attack : తన కూతురు వెంట పడద్దని హెచ్చరించినందుకు ఒక యువకుడు  ఆమె తండ్రిని  కత్తితొ పొడిచి గాయపరిచాడు. మహారాష్ట్రలోని భివాండీలో నివసించే అన్సారీ(49) అనే వ్యక్తి   కూతురికి అర్బాజ్ ఖాన్ అనే బోయ్ ఫ్రెండ్ ఉన్నాడు.

ఈవిషయం తెలిసిన అన్సారీ, అర్బాజ్ ఖాన్‌ని పలుమార్లు మందలించాడు. తనకూతురు, మేన కోడలితో మాట్లడవద్దని హెచ్చరించాడు. బుధవారం రాత్రి అన్సారీ ఇంటివద్ద తన స్నేహితుడితో కలిసి ఉండగా అర్బాజ్ ఖాన్ మాట్లాడానికి వచ్చాడు. ఆ సమయంలో తన కూతురితో మాట్లాడే విషయమై ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. రెచ్చిపోయిన అర్బాజ్ ఖాన్ కత్తి   తీసుకుని అన్సారీపై దాడి చేశాడు.

Also Read : Woman Dress Changing : ట్రయల్‌రూమ్ లో బట్టలు మార్చుకుంటుండగా వీడియో తీసిన యువకులు

తీవ్రగాయాలైన   అన్సారీ  అక్కడికక్కడే  కుప్పకూలిపోయాడు. వెంటనే స్ధానికులు అతడ్ని ఆస్పత్రికి  తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు బాధితుడి వాంగ్మూలం తీసుకుని నిందితుడు అర్బాజ్ ఖాన్ ను అరెస్ట్ చేశారు.