శంషాబాద్ ఎయిర్ పోర్టులో 2 కిలోల బంగారం పట్టివేత

హైదరాబాద్: అక్రమంగా తరలిస్తున్న 2 కిలోల బంగారాన్నిశంషాబాద్ ఎయిర్ పోర్టు లో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. షార్జానుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు వద్ద నుంచి 2.3 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎలక్ట్రానిక్ మెషీన్ అంతర్భాగంలో బంగారాన్ని అమర్చి తరలించడానికి ప్రయత్నించగా కస్టమ్స్ అధికారులు గుర్తించి ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.