Hyderabad : నీటి తొట్టిలో పడి 2 నెలల బాలుడు మృతి
రంగారెడ్డి జిల్లా అబ్లుల్లాపూర్‌మెట్ పోలీసుస్టేషన్ పరిధి, అనాజ్‌పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. 2నెలల బాలుడు నీటి తొట్టిలో శవమై తేలటం కలకలం రేపింది.

Hyderabad
Hyderabad : రంగారెడ్డి జిల్లా అబ్లుల్లాపూర్‌మెట్ పోలీసుస్టేషన్ పరిధి, అనాజ్‌పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. 2నెలల బాలుడు నీటి తొట్టిలో శవమై తేలటం కలకలం రేపింది. రాత్రి తల్లితండ్రులతో కలిసి నిద్రించిన బాలుడు తెల్లారే సరికి నీటి తొట్టిలో శవమై కనిపించాడు.
రాత్రి తమ వద్దే నిద్రించిన బాలుడు అర్ధరాత్రి 2 గంటల నుంచి కనిపించక పోవటంతో కుటుంబ సభ్యులు ఆచూకి కోసం అంతా వెతికారు. అయినా ఎక్కడా బాలుడి ఆచూకి లభించక పోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇంటి చుట్టు పక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజిలు పరిశీలించినా ఎటువంటి క్లూ లభించలేదు. దీంతో బాలుడి ఇంటిని పోలీసులు అణువణువునా గాలించారు. చివరకు ఇంటిపైన ఉన్న నీటి ట్యాంకును పరిశీలించగా బాలుడి మృతదేహం అందులో లభ్యం అయ్యింది. బాలుడి మృత దేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇది ప్రమాద వశాత్తు జరిగిందా…. హత్యా ? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటన స్ధానికంగా కలకలం సృష్టించింది. కుటుంబ తగాదాల నేపధ్యంలో హత్య జరిగి ఉంటుందని స్ధానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.