Murder
Murder : తన కూతురిని లైంగికంగా వేధిస్తున్న వ్యక్తిని ఆమె తండ్రి హత్య చేశాడు. పక్కా ప్లాన్ ప్రకారం.. మాట్లాడాలని ఆ యువకుడిని పిలిచిన అతడు.. పట్టపగలే.. రన్నింగ్ బైక్ పై నే మర్డర్ చేశాడు. బైక్ పై వెనకాల కూర్చున్న అతడు.. అదను చూసి… బైక్ నడుపుతున్న వ్యక్తి గొంతుకోశాడు. హైదరాబాద్ ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. వాటిని చూసిన పోలీసులే కంగుతిన్నారు. మర్డర్ స్కెచ్ మామూలుగా లేదనే కామెంట్స్ చేస్తున్నారు.
అబ్దుల్ షారూక్(27) ఆటో డ్రైవర్. మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ముస్తఫానగర్ లో నివాసం ఉంటున్నాడు. కాగా, షారూక్ తన కూతురిని వేధిస్తున్నాడని సయ్యద్ అన్వర్ గతేడాది పోలీసు కేసు పెట్టాడు. పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. అయినా పద్ధతి మార్చుకుని షారూక్ మళ్లీ వేధింపులకు పాల్పడినట్లు అన్వర్ చెప్పాడు. తన కూతురిని పెళ్లి చేసుకున్నానని, కాపురానికి పంపాలని ఒత్తిడి తెచ్చినట్లు పోలీసులకు వివరించాడు.
షారూక్ వేధింపులు భరించలేకపోయిన అన్వర్, అతడిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం మాట్లాడుకుందామని షారూక్ ని పిలిపించాడు. ఇద్దరూ కలిసి బైక్ పై వెళ్తున్నారు. అదే సమయంలో అదను చూసి బైక్ నడుపుతున్న షారూక్ గొంతుకోశాడు అన్వర్. బైక్ దిగి కొంతదూరం పరిగెత్తిన షారూఖ్ ఫలక్ నుమా బస్ డిపో సమీపంలో మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా షారూక్ ను హత్య చేసింది అన్వరేనని గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.