DAV Public School : హైదరాబాద్ డీఏవీ పబ్లిక్ స్కూల్‌లో దారుణం.. ఎల్‌కేజీ బాలికపై ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ అత్యాచారం

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ లో దారుణం జరిగింది. స్కూల్ ప్రిన్సిపాల్ మాధవి కారు డ్రైవర్ రజనీకుమార్ ఘోరానికి ఒడిగట్టాడు.

DAV Public School : హైదరాబాద్ బంజారాహిల్స్ లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ లో దారుణం జరిగింది. స్కూల్ ప్రిన్సిపాల్ మాధవి కారు డ్రైవర్ రజనీకుమార్ ఘోరానికి ఒడిగట్టాడు. ఎల్ కేజీ చదువుతున్న నాలుగున్నరేళ్ల బాలికపై రెండు నెలలుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. స్కూల్ లో ల్యాబ్ ల నిర్వహణ కూడా చూస్తున్న రజనీకుమార్.. సోమవారం మరింత బరి తెగించాడు.

ప్రిన్సిపాల్ రూమ్ ఎదురుగా ఉన్న ల్యాబ్ లో బాలికపై అత్యాచారం చేశాడు. అంతేకాదు, విషయం ఎవరికీ చెప్పొద్దని బాలికను బెదిరించాడు. కాగా, బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు కీచక డ్రైవర్ కు దేహశుద్ధి చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పోక్సో చట్టం కింద అతడిపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత స్కూల్ ప్రిన్సిపాల్ మాధవిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఈ ఘటనతో ఒక్కసారిగా స్కూల్ లోని ఇతర పిల్లలు, వారి తల్లిదండ్రులు ఉలిక్కిపడ్డారు. ప్రైవేట్ స్కూళ్లలో చిన్నారుల భద్రతపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. లక్షల్లో ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లు.. పిల్లల భద్రతను మాత్రం గాలికొదిలేస్తున్నాయని మండిపడుతున్నారు. బంజారాహిల్స్ లోని డీఏవీ పాఠశాలలో చిన్నారిపై అత్యాచారం క్షమించరాని నేరం అంటున్నారు. ఈ ఘటనలో స్కూల్ యాజమాన్యంతో పాటు బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.