5 Y old Child Dies In Mother Arms In Madhya Pradesh
Child Dies In Mother Arms: పేదలకు సరైన విద్య, వైద్యం అందనిద్రాక్షగానే మిగిలిపోతోంది. లాభపేక్ష లేకుండా అందించాల్సిన ఈ రెండు సేవలు అతిపెద్ద వ్యాపారాలు అయ్యాయి. కార్పొరేట్లో ఫీజులు భరించలేము, ప్రభుత్వం నడిపే వాటిలో పట్టింపే ఉండదు. పేదల విషయంలో ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ వైద్యుల పనితీరు గురించి చెప్పాలంటే తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఒక ఘటనే మంచి ఉదాహరణ.
ఒక తల్లి తీవ్ర అనారోగ్యంతో తన ఐదేళ్ల బిడ్డను ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. అయితే వైద్యం అందించడానికి డాక్టర్లు అందుబాటులో లేరు, కాసేపు ఆగమని చెప్పారు. అలా ఆమె గంటల తరబడి ఆసుపత్రి బయటే తన బిడ్డను ఓదార్చుతూ తన కన్నీళ్లను తుడుచుకుంటూ ఉంది. ఎంత సేపటికీ ఒక్క డాక్టర్ కూడా రాలేదు. ఎంత సేపటికీ వైద్యం అందక ఆ పసి బిడ్డ తల్లి ఒడిలోనే ప్రాణం విడిచింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ జిల్లాలో ఉన్న ఒక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో జరిగిందీ దారుణం.
Cervical Cancer Vaccine: బాలికలకు గుడ్ న్యూస్.. గర్భాశయ క్యాన్సర్కు వ్యాక్సిన్ విడుదల
మరణించిన చిన్నారి పేరు రిషి. తండ్రి సంజయ్ పండ్రే మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రం ఎదుట ఎంతసేపు ఎదురు చూసినా ఒక్క డాక్టర్ అయినా తన బిడ్డకు వైద్యం చేయడానికి రాలేదని, అసలు తమను పట్టిచుకోనే లేదని దు:ఖించాడు. ఈ విషయమై సదరు కేంద్రం డాక్టర్ను ప్రశ్నించగా.. ముందు రోజు రాత్రి తన భార్య ఉపవాసం ఉండడం వల్ల ఆరోగ్య కేంద్రానికి రావడం ఆలస్యమైందని సమాధానం ఇచ్చాడు.
ఈ ఘటనతో రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యంపై మరోసారి విమర్శలు చెలరేగాయి. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆసుపత్రీ సరిగా లేదని, జిల్లా స్థాయి ఆసుపత్రుల నుంచి పీహెచ్సీల వరకు వైద్య సదుపాయాలు ఏమాత్రం లేవని, వైద్యులు సరిగా లేరని, ఉన్నా సమయ పాలన పాటించరంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా, తాజా ఘటనపై ప్రభుత్వ అధికారులు ఎవరూ ఇంకా స్పందించలేదు.
Vigilance Officers Searches : ఏపీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో విజిలెన్స్ దాడులు