Cervical Cancer Vaccine: బాలికలకు గుడ్ న్యూస్.. గర్భాశయ క్యాన్సర్‭కు వ్యాక్సిన్‌ విడుదల

గర్భాశయ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా దేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి క్వాడ్రివాలెంట్ హ్యూమన్ పాపిల్లోమావైరస్ వ్యాక్సిన్ ఇది. 9 నుంచి 14 సంవత్సరాల లోపు బాలికలకు ఈ గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్‭ను జాతీయ ఇమ్యూనైజేషన్ కార్యక్రమంలో భాగంగా అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Cervical Cancer Vaccine: బాలికలకు గుడ్ న్యూస్.. గర్భాశయ క్యాన్సర్‭కు వ్యాక్సిన్‌ విడుదల

First Vaccine For Cervical Cancer were Released

Cervical Cancer Vaccine: దేశంలోని బాలికలకు గుడ్ న్యూస్.. గర్భాశయ క్యాన్సర్‭కు వ్యతిరేకంగా పూర్తి స్వదేశీయతతో తొలి వ్యాక్సిన్ తయారైంది. సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రూపొందించిన ఈ వ్యాక్సిన్‭ను కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ గురువారం విడుదల చేశారు. గత నెలలోనే ఈ వ్యాక్సిన్‭ తయారు చేసే బాధ్యతను సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు అప్పగించగా.. నెల రోజుల్లోనే వ్యాక్సీన్ రూపొందించడం గమనార్హం.

‘‘90 శాతం గర్భాశయ క్యాన్సర్ నిర్దిష్ట వైరస్ వల్ల వస్తుందని, ఈ వ్యాక్సిన్ ఆ వైరస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుంది’’ అని ఈ వ్యాక్సిన్ విడుదల సందర్భంగా కోవిడ్ వర్కింగ్ గ్రూప్ చైర్‌పర్సన్, నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ డాక్టర్ ఎన్‌కె అరోరా అన్నారు. ఈ వ్యాక్సిన్ రాకతో భారతదేశ వైద్య శాస్త్రంలో ఒక మైలురాయి సాధించినట్లయింది. గర్భాశయ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా దేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి క్వాడ్రివాలెంట్ హ్యూమన్ పాపిల్లోమావైరస్ వ్యాక్సిన్ ఇది. 9 నుంచి 14 సంవత్సరాల లోపు బాలికలకు ఈ గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్‭ను జాతీయ ఇమ్యూనైజేషన్ కార్యక్రమంలో భాగంగా అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

కాగా, ఈ విషయమై కేంద్ర మంత్రి జితేంద్ర మాట్లాడుతూ ‘‘గర్భాశయ క్యాన్సర్‌కు స్వదేశీంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి వ్యాక్సిన్‌ను భారతదేశం విడుదల చేసింది. చిన్న వయస్సులో ఉన్న మహిళల్లో ఈ క్యాన్సర్ ప్రబలంగా ఉంది. కానీ మనకు వ్యాక్సిన్ అందుబాటులో ఉంది’’ అని హర్షం వ్యక్తం చేశారు. ఇక సీరం ఇనిస్టిట్యూట్ అధినేత అధర్ పూనంవాలా స్పందిస్తూ ‘‘ఈ వ్యాక్సీన్ ధరను కొద్ది రోజుల్లో ప్రకటిస్తాం. అయితే ఇది 200 రూపాయల నుంచి 400 రూపాయల మధ్య ఉండే అవకాశం ఉంది. అయితే భారత ప్రభుత్వంతో చర్చించిన అనంతరం ఎంత అనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటాం’’ అన్నారు.

Assam : నెలలు నిండకుండానే గర్భిణికి సర్జరీ చేసి శిశువు పూర్తిగా తయారవ్వలేదని మళ్లీ లోపల పెట్టి కుట్లు వేసిన డాక్టర్