Assam : నెలలు నిండకుండానే గర్భిణికి సర్జరీ చేసి శిశువు పూర్తిగా తయారవ్వలేదని మళ్లీ లోపల పెట్టి కుట్లు వేసిన డాక్టర్

నెలలు నిండకుండానే గర్భిణికి సర్జరీ చేసి శిశువు పూర్తిగా తయారవ్వలేదని మళ్లీ లోపల పెట్టి కుట్లు వేసాడు ఓ డాక్టర్.

Assam : నెలలు నిండకుండానే గర్భిణికి సర్జరీ చేసి శిశువు పూర్తిగా తయారవ్వలేదని మళ్లీ లోపల పెట్టి కుట్లు వేసిన డాక్టర్

assam doctor replants 7 month old baby in mothers womb

assam doctor replants 7 month old baby in mothers womb : కొంతమంది గవర్నమెంట్ డాక్టర్ల నిర్లక్ష్యంతో ఎంతోమంత్రి ప్రాణాలు పోయిన సందర్భాలున్నాయి. మరెంతోమంది ప్రాణాలమీదకు వచ్చిన ఘటనలు జరిగాయి. అలా డాక్టర్ల నిర్లక్ష్యం ఏకంగా ఓ గర్భిణికి నెలలు నిండకుండానే ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న బిడ్డను బయటకు తిసి ఆ శిశువు పూర్తిగా వృద్ధి చెందలేని తెలిసి తిరిగి కడుపులో పెట్టి కుట్టేసిన ఘటన అస్సాంలో చోటుచేసుకుంది. ఏదో అల్మారాలో వస్తువు తీసి అదికాదు అన్నట్లుగా తిరిగి అల్మారాలో పెట్టేసినట్లుగా గర్భిణి కడుపులో ఉన్న బిడ్డను బయటకు తీసి ఆ బిడ్డ ఇంకా పూర్తిగా వృద్ధి చెంలేదని కడుపులో పెట్టి కుట్లు వేసేశాడు ఓ డాక్టర్. డాక్టర్ చేసిన ఈ ఘనకార్యం తెలిసి సదరు గర్భిణి బంధువలు ఆందోళన చేపట్టారు.

అస్సాం కరీంగంజ్ లోని గవర్నమెంట్ ఆస్పత్రికి ఓ గర్భిణి వచ్చింది. డాక్టర్ గారూ కడుపులో నొప్పి వస్తోంది అని చెప్పింది. అప్పటికి ఆమెకు ఏడు నెలలు. ఆమెను పరీక్షించిన డాక్టర్ నవీ నమశూద్ర అనే 7 నెలల ప్రెగ్నెంట్ మహిళ.. కడుపులో నొప్పి రావడంతో..గైనకాలజిస్ట్ ఆశిష్ కుమార్ బిస్వాస్ ఆమె ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా తెలుసుకోలేదు. అంతేకాదు కనీసం ఆమెకు ఎన్ని నెలల గర్భం అని కూడా తెలుసుకోకుండానే డెలీవరీ చేయాలి అంటూ ఏకంగా సర్జరీ చేసేశాడు. తీరా బిడ్డను బయటకు తీశాక..అయ్యో పిండం ఇంకా పూర్తిగా శిశువుగా వృద్ధి చెందలేదు అని తెలుసుకుని తిరిగి బిడ్డను కడుపులో పెట్టి కుట్లు వేసేశాడు.

అదేదో సర్వసాధారణం అన్నట్లుగా. ఏడా డ్రాలోంచి వస్తువుని తీసి తిరిగి పెట్టేసినట్లుగా. ఈ తరువాత దాదాపు రెండు వారాలకు సదరు గర్భిణి ఆరోగ్య పరిస్థితి విషమించింది. తిరిగి హాస్పిటల్ కు రావటంతో అప్పటికే ఆమెకు సర్జరి జరిగినట్లుగా తెలిసింది. ఈ విషయం తెలిసిన ఆమె బంధువులు డాక్టర్ నవీ నమశూద్రపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రాణాలంటే లెక్కలేకుండా ఉందా అంటూ విరుచుకుపడ్డారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.