మంటగలిసిన మానవత్వం: తండ్రి కళ్లెదుటే కూతురిపై గ్యాంగ్ రేప్

మంటగలిసిన మానవత్వం: తండ్రి కళ్లెదుటే కూతురిపై గ్యాంగ్ రేప్

Updated On : February 8, 2019 / 10:43 AM IST

మానవ హక్కులు, మహిళా సంఘాలు అని స్త్రీ భద్రత కోసం వేలు, లక్షల మంది గొంతెత్తి అరుస్తున్నా.. రోజురోజుకీ జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డు లేకుండాపోతుంది. ఒంటిగా ఉన్న ఆడపిల్లలపై రెచ్చిపోయే దుర్మార్గాలకు పాల్పడే నేరస్థుల కంటే భయంకరంగా ఉంది పరిస్థితి. కన్నతండ్రి కళ్లెదుటే కావాలని హింసించి అత్యాచారాలకు పాల్పడతున్నారు. చట్టంపైనా, సమాజంపైనా భయం, బాధ్యత కనిపించని దుండగులు తండ్రిని కట్టేసి కూతురిపై సామూహిక అత్యాచారం జరిపేందుకు కూడా వెనుకాడలేదు. 

ఇటీవలే బీహార్‌లో ఇటువంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయి విచక్షణ కోల్పాయిన ఆరుగురు 19 ఏళ్ల మహిళను రేప్ చేశారు. బీహార్‌లోని కిషన్ గంజ్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. 

ఇటీవలే ఇల్లు మారి అద్దెకు ఉంటుంది ఓ మధ్య తరగతి కుటుంబం. ఫిబ్రవరి 4వ తేదీ సోమవారం రాత్రి సమయంలో ఆరుగురు దుండగులు తలుపుకొట్టి మంచి నీళ్లు అడిగారు. మాట్లాడుతుండగానే తోసుకుంటూ ఇంట్లోకి చొరబడ్డారు. తండ్రిని కూతురిని ఇద్దర్నీ ఊరు శివారు ప్రాంతాలకు తీసుకెళ్లారు. తండ్రిని తీవ్రంగా హింసించి చెట్టుకు కట్టేశారు. అతను చూస్తుండగానే కూతురు ఒంటిపై తీవ్రంగా గాయాలు చేస్తూ అత్యాచారానికి ఒడిగట్టారు. ఆ దాడికి బాధితురాలు అపస్మారక స్థితికి చేరుకోవడంతో పరారైయ్యారు. 

కాసేపటికి కోలుకున్న మహిళ తండ్రిని విడిపించుకుని గ్రామానికి చేరుకుంది. గ్రామస్థులంతా కేసు పెట్టొద్దని అలా చేస్తే చంపేస్తారేమోనంటూ భయపెట్టారు. ఆ జిల్లా ఎస్పీ కుమార్ ఆశిష్ చొరవతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు తెలుసుకున్న పోలీసులు నేరస్థుల్ని వెంటనే పట్టుకుంటామని బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పి హామీ ఇచ్చారు.