Italy Landslide 7 Dead : ఇటలీలో ఘోర ప్రమాదం.. కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి

ఇటలీలో ఘోర ప్రమాదం జరిగింది. ఇస్కియా ఐలాండ్‌లో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పలువురు బురదలో కూరుకుపోయారు.

italy landslide

Italy Landslide 7 Dead : ఇటలీలో ఘోర ప్రమాదం జరిగింది. ఇస్కియా ఐలాండ్‌లో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పలువురు బురదలో కూరుకుపోయారు. మృతుల్లో మూడు వారాల చిన్నారి కూడా ఉంది. ఇస్కియా ఐలాండ్‌లో కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.

దీంతో సముద్ర తీరంలో ఉన్న భారీ కొండపై నుంచి కొంత భాగం జారిపోయింది. ఒక్కసారిగా నెట్టుకొచ్చిన కొండచరియల తాకిడికి కొండ కింద ఉన్న భవనాలు కుప్పకూలి పోయాయి. దీంతో చిన్నారి సహా ఏడుగురు మరణించారు. పార్కింగ్ లోని పలు వాహనాలు సముద్రంలోకి నెట్టివేయబడ్డాయి.

Venezuela Landslide : వెనిజులాలో విరిగిపడ్డ కొండచరియలు .. 22మంది మృతి, 52మంది పైగా గల్లంతు

ఇస్కియాలో గత ఆరు గంటల్లో 126 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 20 ఏళ్లలో ఆ ప్రాంతంలో భారీ వర్షపాతం నమోదు కావడం ఇదే మొదటిసారని అధికారులు పేర్కొన్నారు. ఘటనా ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.