Dating Sites : హై ప్రొఫైల్ లేడీస్‌తో పరిచయం-76 ఏళ్ల వృధ్దుడి నుంచి రూ.60 లక్షలు కాజేసిన మోసగాళ్లు

హై ప్రోప్రైల్ లేడీస్ తో పరిచయం కల్పిస్తామని చెప్పి 76 ఏళ్ల వృధ్ధుడిని రూ.60 లక్షల రూపాయలు మేర మోసం చేసిన ఘటనలో పూణే పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు.

Dating Sites : హై ప్రొఫైల్ లేడీస్‌తో పరిచయం-76 ఏళ్ల వృధ్దుడి నుంచి రూ.60 లక్షలు కాజేసిన మోసగాళ్లు

dating site

Updated On : February 19, 2022 / 8:03 PM IST

Dating Sites : ఆడవారితో పరిచయం అనగానే ముసలివారు కూడా లేచి పరిగెడతారని హాస్యానికి అంటుంటారు. హై ప్రోప్రైల్ లేడీస్ తో పరిచయం కల్పిస్తామని చెప్పి 76 ఏళ్ల వృధ్ధుడిని రూ.60 లక్షల రూపాయలు మేర మోసం చేసిన ఘటనలో పూణే పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు.

మహారాష్ట్రలోని పూణే జిల్లాలో నివసించే ఓ 76 ఏళ్ల వృధ్దుడు పేపరులో వచ్చిన ఫ్రెండ్ షిప్ క్లబ్ ప్రకటన చూసి ఆకర్షితుడయ్యాడు.  ఆ క్లబ్ లో చేరితే హై ప్రోఫైల్ లేడీస్ తో డేటింగ్ చేయొచ్చని… తద్వారా డబ్బులు సంపాదించవచ్చని ఆ ప్రకటన సారాంశం.

దీంతో ఆ వృధ్ధుడు అందులో ఇచ్చిన నెంబరుకు సంప్రదించాడు. వారు హై ప్రొఫైల్ మ‌హిళ‌ల‌తో డేటింగ్ ఏర్పాటు చేస్తామని… తద్వారా  డబ్బు కూడా సంపాదించ‌వ‌చ్చ‌ని వృద్ధుడిని నిందితులు ప్ర‌లోభానికి గురిచేశారు. మే 2021 నుంచి ఫిబ్రవరి 22 మధ్య కాలంలో అతని వద్ద నుంచి మెంబర్ షిప్ ఫీజు ఇతర సెక్యూరిటీ డిపాజిట్ల కింద నిందితులు రూ.60 లక్షల వరకు వసూలు చేశారు.
Also Read : Manchu Family: ట్రోలర్లపై రూ.10కోట్ల పరువు నష్టం వేస్తానన్న మోహన్ బాబు
ఇంత డబ్బు ఇచ్చినా నిందితులు మహిళలను పరిచయం చేయక పోవటంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మనోర్(35) అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో నగదు మళ్లింపుకు సహకరించిన మరో మహిళ(28)ను ఈనెల 11వ తేదీన అరెస్ట్ చేసినట్లు పూణే సైబర్ సెల్ ఇన్ స్పెక్టర్ సంగీత మాలి తెలిపారు. కేసు దర్యాప్తు వేగవంతం చేశామని ఆమె తెలిపారు.